India vs Australia 2nd T20I, Rohit Sharma praises Dinesh Karthik: నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 91 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7.2 ఓవర్లలోనే 92 స్కోరు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ (46 నాటౌట్; 20 బంతుల్లో 4×4, 4×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఇక ఫినిషర్ దినేష్ కార్తీక్ చివరి ఓవర్లో వరుసగా 6, 4 ఫోర్ కొట్టి మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ కాస్తా 8 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.ఇక హోరాహోరీగా సాగుతున్న సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం ఉప్పల్‌లో జరగనుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫినిషర్ దినేష్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. డీకే మ్యాచ్ ముగించినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. 'ఇలా ఆడతామని నేను కూడా ఊహించలేదు. చాలా ఆశ్చర్యపోయా. చివరకు మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత 8-9 నెలలుగా నేను ఇదే తరహాలో ఆడుతున్నా. నా బ్యాటింగ్ శైలిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇలాంటి మ్యాచులలో ముందుగా ప్లాన్ చేయలేము. పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది' అని రోహిత్ అన్నాడు.
'మేము బాగా బౌలింగ్ చేసాము. అయితే మంచు కారణంగా హర్షల్ పటేల్ కొన్ని ఫుల్ టాస్‌లను వేశాడు. కొన్ని నెలల తర్వాత జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడం ఆనందాన్ని ఇస్తోంది. అతను మళ్లీ గాడిన పడుతున్నాడు. బుమ్రా గురించి నేను ఎక్కువగా మాట్లాడను. వెన్ను గాయం నుంచి కోలుకోవడం అంత సులువు కాదు. అక్షర్ పటేల్ ఏ దశలోనైనా బౌలింగ్ చేయగలడు. దాంతో ఇతర బౌలర్లను ఉపయోగించుకోవడం సులువుగా మారింది. పవర్‌ప్లేలో అక్షర్ బౌలింగ్ చేస్తే మిడిల్ ఓవర్లలో పేసర్లను ఉపయోగించుకోవచ్చు. అతని బ్యాటింగ్‌ను కూడా చూడాలనుకుంటున్నా' అని రోహిత్ శర్మ చెప్పాడు.
'దినేష్ కార్తీక్ మ్యాచ్ ముగించినందుకు చాలా ఆనందంగా ఉంది. హార్దిక్ పాండ్యా ఔట్ అయిన అనంతరం కొంత గందరగోళానికి గురయ్యా. డీకే లేదా రిషబ్ పంత్.. ఎవరు క్రీజులోకి వస్తే బాగుంటుందని ఆలోచించా. డానియల్ సామ్స్ ఆఫ్-కట్టర్లను బౌలింగ్ చేస్తాడని నేను అనుకున్నా. అందుకే డీకేను క్రీజులోకి రావాలని సూచించా. కార్తీక్ జట్టు కోసం ఏదైనా చేస్తాడు. రెండు బంతుల్లో మ్యాచ్ ముగించాడు. ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు గ్రౌండ్స్‌మెన్ మధ్యాహ్నం 1.30 నుంచి కష్టపడ్డారు. వారివలనే మ్యాచ్ సాధ్యమైంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు' అని టీమిండియా సారథి పేర్కొన్నాడు.
Also Read: రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్షిప్ను సాధించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్!
Also Read: Gold Price Today 24 September: పండగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook