Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే వెరీ స్పెషల్ గా ఉండబోతోంది. ఒకే రోజు రెండు మెగా ఈవెంట్లు జరగబోతున్నాయి. తెలంగాణలో అతి పెద్ద పండగ అయినా దసరా వేడుకలు ఆదివారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బొడ్డెమ్మగా కొలుస్తారు. బొడెమ్మను పెట్టి చుట్టూ బతుకమ్మలు ఉంచి మహిళలు ఆడిపాడుతారు. ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆదివారం సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా సందడి కనిపిస్తుంది. ప్రతి ఊరు, వాడలో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతారు. కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. హైదరాబాద్ లోని ప్రతి గల్లీలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలతో పాటు ఇంటిల్లిపాది బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
బతుకమ్మ సంబరాల రోజే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో రెండు జట్లు ఒక్కో గెలుపు సాధించాయి. దీంతో హైదరాబాద్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదికైంది. అది కూడా భారత్. ఆస్ట్రేలియా మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలం తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతలా ఎగబడ్డారో చూశాం. జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల దగ్గర పోలీసులు ఏకంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు సాయంత్రమే జరగనున్నాయి. రాత్రి వరకు మహిళలు బతుకమ్మ ఆడుతారు. సరిగ్గా అదే సమయంలోనే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. దీంతో హైదరాబాదీలకు డబుల్ ధమాకా వచ్చినట్లైంది. సండే కూడా కావడంతో జోష్ మరింత రెట్టింపు అయింది. విద్యాసంస్థలకు దసరా సెలవులు రావడంతో విద్యార్థులంతా ఇండ్లకు వచ్చేశారు. సండే కావడంతో ప్రైవేట్ కార్యాలయాలు ఉండవు. మొత్తంగా అటు బతుకమ్మ.. ఇటు క్రికెట్ మ్యాచ్ తో ఈ సండేను హైదరాబాదీలు ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
Also Read: MS Dhoni: రేపు సోషల్ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?
Also Read: ఇంగ్లాండ్ ను క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఝులన్‌కు ఘనంగా వీడ్కోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hyderabad: హైదరాబాదీలకు డబుల్ ధమాకా.. ఈ సండే వెరీ స్పెషల్ గురూ..
బతుకమ్మ సంబరాలు షరూ
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్
హైదరాబాదీలకు స్పెషల్ సండే