Shukra Asta 2022: ఇవాళ అస్తమించనున్న శుక్రుడు.. మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం..

Shukra Asta 2022 Effect: ఈరోజు అంటే అక్టోబర్ 1 నుంచి శుక్ర గ్రహం అస్తమిస్తోంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 09:08 AM IST
Shukra Asta 2022: ఇవాళ అస్తమించనున్న శుక్రుడు.. మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం..

Shukra Asta 2022 October: ప్రేమ, శృంగారం, ఆనందం, లగ్జరీ లైఫ్ ను గ్రహం శుక్రుడు. ఇది అక్టోబర్ 1వ తేదీ ఉదయం 5:05 గంటలకు అస్తమించనుంది. నవంబరు 20 వరకు శుక్రుడు (Shukra Asta 2022) అస్తమిస్తాడు. ఈ సమయంలో వివాహం, క్షవరం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగవు. మొత్తం 12 రాశుల మీద శుక్రుడు అస్తమించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

మేషం (Aries)- శుక్రుడు అస్తమించడంతో మీకు శత్రువులు తగ్గుతారు. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు.  
వృషభం (Taurus)- శుక్రుడు అస్తమయం ఈ రాశివారికి కలిసిరాదు. విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం కావడానికి సమయం పడుతుంది. 
మిథునరాశి (Gemini)- ఆస్తి, సౌకర్యాలపై ఖర్చు తగ్గుతుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి చెడు వార్తలను వింటారు.  
కర్కాటకం (Cancer)- సోమరితనం పెరుగుతుంది కానీ మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగం నుండి లాభం ఉంటుంది. ఇంట్లోని పెద్దల మద్దతు ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
సింహం (Leo)- మీ వాక్ చాతుర్యంతో ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తారు. అప్పు ఎవరికీ ఇవ్వద్దు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. 
కన్య (Virgo)- ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వివాహ విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. 

తుల (Libra)- ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. మీరు అనవసర ఖర్చుల నుండి ఉపశమనం పొందుతారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారాన్ని కొనసాగించండి. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చికం (Scorpio)- పని పెరుగుతుంది. శ్రమకు తగ్గట్టుగా ఫలాలు అందవు కానీ పురోగతి ఉంటుంది. పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీరు త్వరలోనే శుభవార్త వింటారు.  
ధనుస్సు (Sagittarius)- ఉద్యోగాల విషయంలో చేస్తున్న ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు తగ్గవచ్చు. కొత్త ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మకరం (Capricorn)- ఉద్యోగ - వ్యాపారాలలో అలసత్వం ఉంటుంది. మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దానధర్మాలు చేస్తారు. సన్నిహితులు మాత్రమే మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించగలరు.
కుంభం (Aquarius)- మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. పాత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. టెన్షన్ పోతుంది. శత్రువులు ఎటువంటి హాని చేయలేరు. పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. 
మీనం (Pisces)- వివాహంలో జాప్యం జరగవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఎదురువుతాయి. 

Also Read: శని-బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారం.. ఈ 4 రాశులవారికి ఊహించని ధనలాభం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News