Godfather Collections: మూడు రోజులైనా ఖైదీ నెం.150 మొదటి రోజు కలెక్షన్స్ బీట్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్!

Godfather 3 days collections are lesser than Khaidi No 150 1st day: గాడ్ ఫాదర్ మూడు రోజుల వసూళ్లు ఖైదీ నెంబర్ 150 కంటే తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 8, 2022, 02:25 PM IST
Godfather Collections: మూడు రోజులైనా ఖైదీ నెం.150 మొదటి రోజు కలెక్షన్స్ బీట్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్!

Godfather 3 days collections are lesser than Khaidi No 150 1st day: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించారు. వీరు కాక సర్వదామన్ బెనర్జీ, తాన్య రవిచంద్రన్, సునీల్, దివి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించగా రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్న మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం అనేక మార్పులు చేర్పులు కూడా చేశారు మోహన్ రాజా. అయితే అసలు విషయం ఏమిటంటే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్నా సరే ఈ సినిమా కలెక్షన్స్ మీద మాత్రం ఏమాత్రం ప్రభావం లేదని అంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల 36 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది.  గ్రాస్ గా చూసుకుంటే 62 కోట్ల 55 లక్షలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా మెగాస్టార్ హీరోగా రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా కంటే దారుణమైన వసూళ్లు తెచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలు విషయం ఏమిటంటే ఖైదీ నెంబర్ 150 సినిమా మొదటి రోజు సుమారు 35 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టింది. తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టుగా మెగాస్టార్ చెప్పుకున్న సైరా నరసింహారెడ్డి 45 కోట్ల దాకా రాబట్టింది ఆచార్య లాంటి డిజాస్టర్ టాక్ చేరుకున్న సినిమా కూడా మొదటి రోజు 30 కోట్లు రాబట్టింది కానీ గాడ్ ఫాదర్ సినిమా మూడు రోజులకు కూడా 35 కోట్లు తెచ్చుకోవడానికి అనేక కష్టాలు పడుతోంది. అయితే నిజానికి ఆశ్చర్య ఎఫెక్ట్ వలన ఈ సినిమాకి పెద్దగా థియేటర్లు లభించలేదు.

అది కాక యూకే, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లో సినిమాని రిలీజ్ కూడా చేయలేదు. ఆ ఎఫెక్ట్ వసూళ్ల మీద ఖచ్చితంగా పడిందని చెప్పాలి. ఇక మొదటి రోజు కంటే రెండు మూడు రోజుల్లో వసూళ్లు పెరగలేదు కానీ ఒక రకంగా బాగానే నిలదొక్కుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రెండు వారాలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్లలో రన్ అవ్వాలని అంటున్నారు. అయితే అది ఎంతవరకు కుదురుతుంది అనే విషయం మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Sarvadaman Banerjee Re Entry: 35 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో.. గాడ్ ఫాదర్లో చిరంజీవి నాన్న గారు ఎవరో తెలుసా..?

Also Read: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News