Cable Bridge Collapsed: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్ది.. తీగల వంతెనపై 400 మంది సందర్శకులు

Gujarat Cable Bridge Collapsed: గుజరాత్‌‌లోని మోర్బిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 140 ఏళ్ల నాటి సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఆ తీగల వంతెనపై 400 మంది వరకు సందర్శకులు ఉన్నట్టు తెలుస్తోంది. 

Written by - Pavan | Last Updated : Oct 30, 2022, 08:18 PM IST
Cable Bridge Collapsed: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్ది.. తీగల వంతెనపై 400 మంది సందర్శకులు

Cable Bridge Collapsed in Gujarat: గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 100 మంది వరకు నదిలో పడిపోగా మిగతా వారు వంతెన తీగలు పట్టుకుని నడుములోతు నీళ్లలో వేళ్లాడుతున్నట్టు సమాచారం అందుతోంది. నీళ్లలో పడిన వారిని స్థానికులు వెలికి తీసుకొస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మచ్చు నదిపై మణిమందిర్ సమీపంలో బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ఈ వంతెనను ఆరు నెలల క్రితమే మరమ్మతుల కోసం మూసేసి తిరిగి ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. 

 

2 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల అనంతరం అందుబాటులోకి వచ్చిన ఈ కేబుల్ బ్రిడ్జిపైకి ఒక్కసారిగా కెపాసిటీని మించి 400 మంది వరకు రావడం వల్లే కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

 

స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనా స్థలంలో బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా గుజరాత్ సీఎంను ప్రధాని మోదీ ఆదేశించారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రికి సూచించారు.

Also Read : IND vs SA Updates: మిల్లర్, మార్క్రమ్ హాఫ్ సెంచరీలు.. టీమిండియాపై సౌతాఫ్రికా విజయం!

Also Read : CM KCR SPEECH : నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిద్దాం.. మునుగోడు సభలో బీజేపీపై కేసీఆర్ విశ్వరూపం

Also Read : CM KCR: చంద్రబాబు బాటలోనే సీఎం కేసీఆర్.. మోడీ సర్కార్ ఏం చేయబోతోంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News