Pakistan In T20 world cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి పాకిస్థాన్ దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కివీస్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (53), మహ్మద్ రిజ్వాన్ (57)చెలరేగి ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. దీంతో 19.1 ఓవర్లలో పాక్ టార్గెట్ పూర్తి చేసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు, శాంటర్న్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది. కెప్టెన్ విలియమ్సన్ (46) రాణించగా.. డారిల్ మిచెల్ (53) అర్ధసెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, నవాజ్ ఒక వికెట్ తీశారు.
153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి పాక్.. లక్ష్య ఛేదనలో ఎక్కడ కూడా ఇబ్బందిపడలేదు. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ బాబర్ అజామ్ కీలక మ్యాచ్‌లో చెలరేగాడు. ఓపెనర్ మహ్మాద్ రిజ్వాన్‌తో కలిసి ఓ వైపు ఆచితూచి ఆడుతూనే.. మరోవైపు వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఇద్దరు తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలోనే 105 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. 42 బంతుల్లో 53 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. బౌల్ట్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించగా.. డారిల్ మిచెల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఆ తరువాత రిజ్వాన్ (57) మహ్మద్ హారీస్‌తో కలిసి విజయం దిశగా నడిపించారు. చివర్లో రిజ్వాన్ ఔట్ అయిన తరువాత కాస్త ఉత్కంఠ నెలకొన్న మహ్మద్ హారీస్ జట్టుకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూశాడు. విజయానికి మరో రెండు పరుగులు అవసరమైన దశలో హరీస్‌ను శాంటర్న్ ఔట్ చేసినా.. అప్పటికే పాక్ విజయం ఖాయమై పోయింది. 19.1 ఓవర్లలో పాకిస్థాన్ మూడు వికెట్ల నష్టానికి టార్గెట్ పూర్తి చేసి ఫైనల్లోకి ప్రవేశించింది.
Also Read: Pak Vs NZ: డారిల్ మిచెల్ మెరుపులు.. పాక్ టార్గెట్ ఎంతంటే..?
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook