BCCI India: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. టీమిండియా నుంచి పెద్ద తల ఔట్!

BCCI not to renew India mental conditioning coach Paddy Upton. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తొలగించిన బీసీసీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 26, 2022, 01:17 PM IST
  • టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్
  • టీమిండియా నుంచి పెద్ద తల ఔట్
  • దిద్దుబాటు చర్యలకు దిగిన భారత్
BCCI India: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. టీమిండియా నుంచి పెద్ద తల ఔట్!

BCCI plans to fire Team India mental conditioning coach Paddy Upton: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ ఫైనల్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. సెమీస్ మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో 169 పరుగులను కాపాడుకోలేక ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. టైటిల్ ఫెవరేట్ అయిన భారత్ సెమీస్ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓపెనర్ల వైఫల్యం, పేలవ బౌలింగ్, రోహిత్ శర్మ కెప్టెన్సీ జట్టు ఓటమికి ప్రధాన కారణాలు. మెగా టోర్నీలో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టడంతో టీమిండియాపై మాజీలు విమర్శల వర్షం కురిపించారు.

టీ20 ప్రపంచకప్ 2022 ఓటమి తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తొలగించిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్‌ను (Paddy Upton) తొలగించాలని బీసీసీఐ నిర్ణయించుకుందట. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్టన్‌ ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించబోదట. టీ20 ప్రపంచకప్ 2022తో ప్యాడీ ఆప్టన్ ఒప్పందం ముగిసింది. 

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా మేరకు 53 ఏళ్ల ప్యాడీ ఆప్టన్‌ను భారత జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. 2022 జులైలో ఆప్టన్‌ టీమిండియాలో భాగమమయ్యారు. ప్యాడీ ఆప్టన్ 2008-11 మధ్య కాలంలో భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్ మరియు స్ట్రాటజిక్ కోచ్‌గా పనిచేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ద్రవిడ్‌తో కలిసి ఆప్టన్ పనిచేశారు. 

ఐపీఎల్‌ టోర్నీలో పాడీ ఆప్టన్ పూణే వారియర్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలాండర్స్ మరియు బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌లకు కూడా కోచ్‌గా సేవలు అందించారు. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టుకు మార్గ దర్శకుడిగా పనిచేశారు. వచ్చే ప్రపంచకప్ భారత్ గెలవాలంటే బీసీసీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని టీమిండియా ఫాన్స్ అంటున్నారు. టీమిండియా నుంచి పెద్ద తల ఔట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: భారత్ ప్రపంచకప్‌ గెలవాలంటే అదొక్కటే మార్గం.. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!  

Also Read: Virat Kohli: నా హృదయంలో ఆ రోజుకు ప్రత్యేక స్థానం.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News