TTD Break Darshanam Timings: తిరుపతి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. బ్రేక్ దర్శనం సమయంలో మార్పులు

TTD Break Darshanam Timings: వైకుంఠం క్యూ కాంప్లెక్సులో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం వీలైనంత త్వరలో దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి తమ ప్రకటనలో పేర్కొంది.

Written by - Pavan | Last Updated : Nov 30, 2022, 05:59 PM IST
  • తిరుపతి వెళ్లే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్యమైన గమనిక
  • బ్రేక్ దర్శనం సమయంలో మార్పులు చేసిన టీటీడీ
  • శ్రీ వాణి ట్రస్ట్ దాతలకు మాధవం విశ్రాంతి గృహంలోనే టికెట్లు, గదులు కేటాయింపు
TTD Break Darshanam Timings: తిరుపతి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. బ్రేక్ దర్శనం సమయంలో మార్పులు

TTD Break Darshanam Timings: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ముఖ్య గమనిక జారీచేసింది. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చోటుచేసుకోనున్నట్టు టిటిడి వెల్లడించింది. నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభించి శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ఈ మార్పునకు శ్రీకారం చుట్టినట్టు టిటిడి స్పష్టంచేసింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్సులో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం వీలైనంత త్వరలో దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి తమ ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేందుకు వీలు కలగనుంది. తద్వారా తిరుమలలో భక్తులు వేచి ఉండే సమయం తగ్గడమే కాకుండా గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భావిస్తోంది.

ఇందుకోసం నవంబరు 30న మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు టికెట్ కౌంటర్ ప్రారంభం కానున్నట్టు టిటిడి వివరించింది. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మాధవం విశ్రాంతి గృహంలోనే ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా టికెట్లు కేటాయిస్తారు. భక్తుల సౌకర్యార్థం వారికి కేటాయించే గదులు కూడా ఇక్కడే పొందవచ్చని టిటిడి ( TTD ) తేల్చిచెప్పింది.

Also Read : Mercury Transit: ఆ రాశిలోకి బుధ గ్రహం సంచారం.. ఈ రాశువారికి ధన ప్రయోజనాలే.. ప్రయోజనాలు..

Also Read : Budh Gochar 2022: డిసెంబర్ 3 నుంచి ఆ నాలుగు రాశులవారు తస్మాత్ జాగ్రత్త, భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే

Also Read : New Year Remedies: కొత్త ఏడాది మొదటి రోజు ఇలా చేస్తే..ఇక ఆ ఏడాది మొత్తం డబ్బేడబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News