IND vs BAN 3rd ODI: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం.. తప్పిన క్లీన్‌స్వీప్‌ గండం!

Ishan Kishan Double Century help India beat Bangladesh in 3rd ODI. మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 410 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే ఆలౌటైంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 10, 2022, 07:25 PM IST
  • బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
  • తప్పిన క్లీన్‌స్వీప్‌ గండం
  • మూడు వన్డేల సిరీస్‌ బంగ్లా 2-1తో కైవసం
IND vs BAN 3rd ODI: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం.. తప్పిన క్లీన్‌స్వీప్‌ గండం!

Ishan Kishan Double Century and Virat Kohli Hundred help India beat Bangladesh in 3rd ODI: చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన నామమాత్రమైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 410 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే ఆలౌటైంది. దాంతో 227 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో ష‌కిబుల్ హాసన్ (43) టాప్‌ స్కోరర్. భారత బౌలర్లు శార్దూల్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ కాకుండా చూసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

410 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఆట‌గాళ్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే త‌డ‌బ‌డ్డారు. నాలుగో ఓవ‌ర్‌లోనే స్పిన్నర్ అక్ష‌ర్ ప‌టేల్‌ ఓపెన‌ర్ అనాముల్ హ‌క్ (8)ను ఔట్ చేశాడు. లిటన్ దాస్ (29), ముష్ఫిక‌ర్ ర‌హీం (7)లు త్వరగానే ఔట్ అయ్యారు. ఈ సమయంలో ష‌కిబుల్ హ‌స‌న్‌ జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ష‌కిబుల్‌కు ఇత‌ర బ్యాట‌ర్ల నుంచి స‌హ‌కారం అంద‌లేదు. భార‌త బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీయ‌డంతో బంగ్లా బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో పడి వికెట్స్ సమర్పించుకున్నారు. శార్థూల్ ఠాకూర్  3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 409 ర‌న్స్ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ (210; 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (113; 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. ఇన్నింగ్స్ చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (37) మెరుపులు మెరిపించడంతో భారత్‌ 400 పరుగుల మార్క్‌ను అధిగమించింది. డబుల్ సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' దక్కింది.  

Also Read: Snake Eats Snake: బతికున్న రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్ స్నేక్‌.. వీడియో చూస్తే పోసుకోవడం పక్కా!  

Also Read: నడుము చూపిస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రద్ధా దాస్! పిక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 

Trending News