BCCI announces Cheteshwar Pujara is a New Vice Captain for India in place of Rishabh Pant: బంగ్లాదేశ్‌తో ఆడిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. చటోగ్రామ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం అయ్యే మొదటి మ్యాచ్ కోసం ఇరు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లా.. టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. కనీసం టెస్టు సిరీస్ అయినా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
వన్డే సిరీస్‌లో భారత్ ఆటగాళ్లు చాలా మంది గాయపడటంతో టెస్టులో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో.. కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రెండో వన్డేలో గాయపడిన రోహిత్.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది మెడికల్ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. తొలి టెస్టుకు రోహిత్ స్థానంలో ఇండియా ఏ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో వీరిద్దరూ టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది. వీరి స్థానాల్లో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. జయదేవ్ ఉనద్కత్ కూడా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక ఇప్పటివరకు టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. సీనియర్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారాను టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. పంత్ గత కొంతకాలంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. అనంతరం జట్టులో నుంచి పూర్తిగా తొలగిస్తుందని భారత క్రికెట్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. పంత్‌కు ప్రస్తుతం సంజూ శాంసన్ నుంచి మాత్రమే కాదు ఇషాన్ కిషన్ నుంచి ముప్పు పొంచి ఉంది.
తొలి టెస్టుకు భారత్ జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
Also Read: Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.