USA Pre Sales of Waltair Veerayya Vs Veera Simhaa Reddy: ఈసారి సంక్రాంతికి ఇద్దరు బడా హీరోలు పోటీ పడుతున్నారు. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ శృతిహాసన్ కావడం రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించడమే.
ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు వ్యవధిలో విడుదల చేస్తున్నారు. ముందుగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన మెగాస్టార్ చిరంజీవి సినిమా జనవరి 13వ తేదీన విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో ఫాన్స్ పోలికలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి మూడు పాటలు రిలీజ్ అవ్వగా పాటలు విషయంలో మెగాస్టార్ చిరంజీవి పాటలకి ఎక్కువ వ్యూస్ అయితే లభిస్తున్నాయి.
అయితే ఇప్పుడు అమెరికాలో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇక ఈ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనే వాటి మీద ఒక లుక్ వేస్తే వీర సింహారెడ్డి సినిమా మొత్తం 147 షోలు రిలీజ్ చేశారు అందులో ఇప్పటివరకు 3090 టికెట్లు అమ్ముడయ్యాయి, దీంతో 60,220 డాలర్లు వసూలు అయ్యాయి.
అదే సమయంలో వాల్తేరు వీరయ్య 145 షోలు రిలీజ్ చేయగా 2231 టికెట్లు అమ్ముడు అయ్యాయి దీంతో 40,158 డాలర్లు వసూలు అయ్యాయి. ఇక ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ కాస్త ముందంజలో ఉన్నారనే చెప్పాలి. దీంతో నందమూరి అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నోట్: ఇంటర్నెట్ లో ఉన్న వివిధ వర్గాల సమాచారం మేరకు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది, ఇందులో ఉన్న సమాచారాన్ని జీ న్యూస్ అధికారికంగా ధృవీకరించడం లేదు.
Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook