Samantha Gym Trainer సమంత ప్రస్తుతం పనిలో పడింది. ఇన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగింది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు కూడా సమంత వచ్చేట్టుగా కనిపిస్తోంది. యశోద సినిమా డబ్బింగ్‌ను బెడ్డు మీద చెప్పేసింది సమంత. ఇక శాకుంతలం సినిమా డబ్బింగ్‌ను సైతం బెడ్డు మీద చెప్పినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సమంత జిమ్‌లో చెమటోడ్చుతున్నట్టుగా అనిపిస్తోంది.
సమంత జిమ్ చేస్తున్నప్పుడు.. ఈ రోజు రెస్ట్ తీసుకునే రోజు అని చెబితే ఇలా చూస్తుంది అన్నట్టుగా ఫ్యామిలీ మెన్ సీజన్ నుంచి రాజీ పాత్రకు సంబంధించిన పోస్టర్్ను షేర్ చేశాడు. ఈ రోజు మంచి రోజు.. వీక్‌గానే ఉన్నా కూడా నేను స్ట్రాంగ్ అని సమంత చెప్పుకొచ్చింది. సమంత వేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
సమంత గత మూడు నాలుగు నెలల నుంచి బయటకు రావడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు అని అందరికీ తెలిసిందే. యశోద సినిమా కంటే ముందే సమంత బెడ్డుకు పరిమితమైంది. సమంతకు చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిని సమంత టీం ఖండించింది. కానీ కొన్ని రోజుల తరువాత సమంతే స్వయంగా తన అనారోగ్యం మీద స్పందించింది. మయోసైటిస్ వచ్చిందని ప్రకటించింది.
సమంతకు మయోసైటిస్ అని తెలియడంతో జనాలు కదిలిపోయారు. మయోసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుని, సమంత పరిస్థితి గురించి బాధపడ్డారు. సమంత కనీనం లేచి నిల్చోలేకపోతోందా? అని జనాలు తెగ ఆందోళన చెందారు. అయితే సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. సమంత మొన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. కానీ కాస్త సీరియస్ లుక్‌లో కనిపించింది. సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది మేకర్లు ప్రకటించారు.
Also Read: Sreemukhi Brother : శ్రీముఖి తమ్ముడి బర్త్ డే పిక్స్.. ముద్దులు పెట్టేసిన రాములమ్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి