Vijaya Sai Reddy Welcomes Chiranjeevi to Vishakapatnam: తాజాగా విశాఖపట్నంలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన ఇక్కడే స్థిరపడతానని కూడా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ దగ్గరలోని భీమిలిలో ఒక స్థలం కొన్నానని త్వరలో ఇక్కడ ఇల్లు కట్టుకుని నేను కూడా విశాఖ వాసిని అవుతానని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
ఏయూ గ్రౌండ్స్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు విశాఖపట్నం వచ్చిన ఏదో ఒక భావోద్వేగానికి గురవుతానని విశాఖ నగరం స్వర్గధామం అంటూ ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని హాలిడే హోమ్ గా గడపాలనే తన చిరకాల కోరికను కూడా త్వరలోనే తీర్చుకోబోతున్నానని ఆయన అన్నారు. అలాగే విశాఖ ప్రజలు విశాల మనస్కులు అని చాలా హుందాగా ఉంటారని సినిమాలను కూడా చూసి బాగా ప్రేమిస్తారని చెప్పుకొచ్చారు.
ఓర్పు కలిగిన ఇలాంటి వారి మధ్య సొంతంగా ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడి విశాఖ పౌరుడిగా ఉంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక విశాఖపట్నంని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ మీద ఒక ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో ఇల్లు కట్టుకుని స్థిరపడాలి అనుకోవడాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు.
అంతేకాదు త్వరలో విడుదల అవుతున్న ఆయన వాల్తేరు వీరయ్య సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కూడా విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇక మీద మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అయితే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అని ప్రకటించారు. విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ పాలన సాగిస్తారని ప్రకటించారు, కానీ ఎందుకో ముందుగా ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయినా వైసీపీ మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని చెబుతోంది.
Also Read: Varasudu Movie: ఇంతకూ వారసుడు వాయిదాకి అసలు కారణం ఇదా.. పెద్ద స్కెచ్చే ఇది!
Also Read: Chiranjeevi Counters: కొరటాల శివపై మెగాస్టార్ ఇన్ డైరెక్ట్ కౌంటర్.. నిజంగా పెడచెవిన పెట్టారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook