Revanth Reddy On Budget 2023: అందుకే కేంద్రంతో కేసీఆర్ కాళ్లబేరానికొచ్చిండు

Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 05:59 AM IST
Revanth Reddy On Budget 2023: అందుకే కేంద్రంతో కేసీఆర్ కాళ్లబేరానికొచ్చిండు

Revanth Reddy Comments On Budget 2023 : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం పట్టించుకోలేదని.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించకుండా బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బడుగు, బలహీనవర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదనే విషయం బడ్జెట్ 2023 తో మరోసారి తేటతెల్లమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్ పార్టీలు రెండూ దోషులే అని చెబుతూ ఆ పార్టీల నేతలపై అసహనం వ్యక్తంచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇద్దరు తోడు దొంగలు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలి. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి అంటూ కేంద్రం ఎదుట పలు డిమాండ్స్ పెట్టారు. 

నరేంద్ర మోదీ.. మీరు కేవలం గుజరాత్‌కు మాత్రమే సీఎం కాదని.... ఈ దేశానికే ప్రధాని అనే విషయం మర్చిపోవద్దు అని గుర్తుచేశారు. బడ్జెట్ 2023 లో నిధుల కేటాయింపుల విషయంలో గుజరాత్‌కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అన్యాయం చేస్తుంటే.. కేంద్రాన్ని నిలదీయాల్సిన బీఆరెస్ పార్టీ పార్లమెంట్‌లో నిస్సహాయంగా నిలబడింది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కుటుంబం చేసిన అవినీతిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసులను కప్పి పుచుకోవడానికే కేసీఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు ఈ బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన గుర్తుచేశారు.

సమ్మక్క సారక్క జాతర నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర
ఫిబ్రవరి 6న తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచే రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ స్థాయి నాయకులు కూడా హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటారని తెలిపారు. మొదటి విడత కింద 60 రోజుల పాటు జరిగే ఈ హాత్ సే హాత్ జోడో యాత్రలో మొత్తం 40 నుంచి 50 నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఆ తరువాత హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత ప్రణాళికలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?

ఇది కూడా చదవండి : Budget 2023: అమృత్ కాల్ అంటే ఏంటి ? బడ్జెట్ స్పీచ్‌లో ఆ పదం పదేపదే ఎందుకు ఉపయోగించారు

ఇది కూడా చదవండి : Tata Nexon, Maruti Fronx: టాటా నెక్సాన్‌కి మారుతి ఫ్రాంక్స్ షాక్ ఇవ్వనుందా ? తక్కువ ధరలోనే SUV Car ?

ఇది కూడా చదవండి : Honda Activa as EV: హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ చేసేశాడు.. మాడిఫికేషన్ ఖర్చు, మైలేజ్ రేంజ్ ఎంతో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News