Revanth Reddy: పార్టీ ఫిరాయింపుదారులపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. వారికి ఉరి శిక్ష వేయాలి

Revanth Reddy in Republic Day 2023 Celebrations: ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 08:03 PM IST
  • ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేయాలి
  • సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలి
  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి
Revanth Reddy: పార్టీ ఫిరాయింపుదారులపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. వారికి ఉరి శిక్ష వేయాలి

Revanth Reddy in Republic Day 2023 Celebrations: పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను వారికి వర్తింపజేయాలన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలని కోరారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలని.. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఫిరాయింపుదారులపై వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. అవసరమైతే పార్టీ ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని డిమాండ్ చేశారు.

దేశం, జాతి గొప్పదనాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒకరిపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని కొంతమంది అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన విద్యా హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని.. విద్యను దూరం చేసి పేదలను మధ్య యుగం వైపు నెడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. 

"కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ రంగాన్ని పెంచింది. బీజేపీ మాత్రం దాన్ని ప్రయివేట్ పరం చేస్తోంది. లక్షలాది కోట్ల విలువైన ఆస్తులను చిల్లర ధరకు అమ్ముకుంటోంది. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టిన ఘనుడు మోదీ. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్ముతుండటంతో దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయి. దేశంలో రిజర్వేషన్ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు.." అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కూడా ఆయర విమర్శలు గుప్పించారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్, రాజ్ భవన్‌కు పరిమితం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫైర్ అయ్యారు. రిపబ్లిక్ డేను నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ వ్యవహారశైలిని మార్చుకోవాలని హితవు పలికారు. గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక మీద చూసుకోవాలని.. గణతంత్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరికాదన్నారు. 

Also Read: Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?  

Also Read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్‌ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News