Nida Dar bowls 7-ball over in Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 150 పరుగుల ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్; 38 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీ చేయగా.. రిచా ఘోష్ (31 నాటౌట్; 20 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచులో ముందుగా వ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మారూఫ్ (68 నాటౌట్; 55 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ బాధగా.. అయేషా నసీమ్ (43 నాటౌట్; 25 బంతుల్లో 2×4, 2×6) దూకుడుగా ఆడింది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం జరిగింది. బౌలర్ చేత ఓ ఓవర్లో అంపైర్ 7 బంతులు వేపించాడు. ఈ ఘటన భారత్ లక్ష్య ఛేదన సందర్భంగా జరిగింది. లక్ష్య ఛేదనలో భారత్ పవర్ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 43 రన్స్ చేసింది. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. 7వ ఓవర్‌ను పాకిస్తాన్ బౌలర్ నిదా ధార్ వేసింది. అయితే నిదా చేత 6 బంతులకు బదులుగా 7 బంతులు వేయించింది యువ అంపైర్ లారెన్ అజెన్‌బాగ్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.
నిదా ధార్ వేసిన మొదటి బంతికి జెమీమా రోడ్రిగ్స్ సింగల్ తీసింది. రెండో బంతిని షఫాలీ వర్మ డాట్ చేయగా.. మూడో బంతికి ఒక పరుగు వచ్చింది. నాలుగో బంతికి రోడ్రిగ్స్ ఒక రన్ తీయగా.. ఐదవ బంతికి షఫాలీ రెండు పరుగులు చేసింది. ఆరో బంతికి షఫాలీ సింగల్ తీసింది. దాంతో 7వ ఓవర్ పూర్తయింది. అయితే ఫీల్డ్ అంపైర్ లారెన్ అజెన్‌బాగ్ పొరపాటున నిదా చేత మరో బంతిని వేయించింది. ఆ బంతికి రోడ్రిగ్స్ బౌండరీ బాదింది.
అంపైర్ లారెన్ అజెన్‌బాగ్ చేసిన పొరపాటుకు సంబందించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోస్ చూసి క్రికెట్ ఫాన్స్ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్ నిద్రపోతుందా అని పాక్ ఫాన్స్ మండిపడుతున్నారు. అంపైర్ వలనే పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకే ఓవర్లో 7 బంతులు వేసిన సంఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో ఓసారి ఇలానే జరిగింది.
Also Read: Honda City Cars: 3 లక్షలకే హోండా సిటీ కారు.. గంటలో నంబర్ ప్లేట్‌తో సహా ఇంటికి తీసుకెళ్లిపోవుచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.