Prisoner Swallowed Mobile Phone in Bihar: బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా జైలులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు తనను పట్టుకుంటారేమోననే భయంతో ఓ ఖైదీ మింగేశాడు. ఆదివారం ఖైదీకి తీవ్ర నొప్పి రావడంతో సెల్ ఫోన్ మింగిన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని జైలు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఖైదీని గోపాల్‌గంజ్‌లోని ఇందర్వా గ్రామానికి చెందిన కైసర్ అలీగా గుర్తించామని అధికారులు తెలిపారు. జనవరి 17, 2020న నగర పోలీసులు హజియాపూర్ గ్రామం సమీపంలో ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గత మూడేళ్లుగా జైలులో ఉన్న అలీ.. అధికారులకు తెలియకుండా తన వద్ద ఓ సెల్ ఫోన్ ఉంచుకున్నాడు. శనివారం అధికారులు చెకింగ్ నిర్వహించగా.. సెల్ ఫోన్ దొరక్కుండా ఉండేందుకు మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. ఆదివారం తీవ్రమైని నొప్పి రావడంతో జైలు అధికారులకు సెల్ ఫోన్ మింగినట్లు చెప్పాడు. వెంటనే జైలు అధికారులు అతన్ని గోపాల్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రేలో కడుపులో ఏదో వస్తువు ఉన్నట్లు తేలిందని గోపాల్‌గంజ్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ వెల్లడించారు.
గోపాల్‌గంజ్ జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సలాం సిద్ధిఖీ మాట్లాడుతూ.. కడుపునొప్పి కారణంగా ఖైదీని ఆసుపత్రిలో చేర్చారని.. అతని కడుపులో ఎక్స్ రే చేయగా ఏదో వస్తువు ఉన్నట్లు కనిపించిందన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఖైదీని తదుపరి చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు తెలిపారు.
జైలులో ఉన్న ఖైదీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం భద్రతా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. మార్చి 2021లో బీహార్ రాష్ట్రవ్యాప్తంగా జైళ్లపై నిర్వహించిన దాడుల్లో దాదాపు 35 సెల్‌ఫోన్‌లు, 7 సిమ్ కార్డులు, 17 సెల్‌ఫోన్ ఛార్జర్‌లు స్వాధీనం చేసుకోవడం విశేషం. రాష్ట్రంలోని కతిహార్, బక్సర్, గోపాల్‌గంజ్, నలంద, హాజీపూర్, అర్రా, జెహనాబాద్‌తో పాటు మరికొన్ని జైళ్లలో ఈ దాడులు జరిగాయి. తాజాగా ఓ ఖైదీ సెల్‌ఫోన్ మింగిన ఘటన కలకలం రేపుతుండగా.. ఇంకా ఎంతమంది ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి