Suresh Raina Recalls MS Dhoni first Meeting: బటర్‌ చికెన్‌, రోటీ తింటున్న ధోనీని చూసి.. వీడేం ఆడుతాడు అనుకున్నాం..! రైనా ఆసక్తికర వ్యాఖ్యలు

Suresh Raina about MS Dhoni Long Hair. ఎంఎస్ ధోనీ పొడవాటి జుట్టును చూసి ఆ అతడు ఏం ఆడుతాడని తమ జట్టు సభ్యులు అనుకున్నారని సురేష్ రైనా తెలిపాడు.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 28, 2023, 12:14 PM IST
  • రోటీ, బటర్‌ చికెన్‌ తింటున్న ధోనీని చూసి
  • వీడు ఏం ఆడుతాడు అనుకున్నాం
  • రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
Suresh Raina Recalls MS Dhoni first Meeting: బటర్‌ చికెన్‌, రోటీ తింటున్న ధోనీని చూసి.. వీడేం ఆడుతాడు అనుకున్నాం..! రైనా ఆసక్తికర వ్యాఖ్యలు

Suresh Raina Recalls MS Dhoni first Meeting in 2005: టీమిండియా మాజీ ప్లేయర్స్ ఎంఎస్  ధోనీ, సురేష్ రైనా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి చాలా కాలం పాటు భారత జట్టుతో పాటుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడారు. ఈ క్రమంలోనే మంచి స్నేహితులు అయ్యారు. అంతేకాదు ధోనీ, రైనా ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు కూడా. అయితే భారత్ మరియు చెన్నై కోసం సహచరులుగా ఆడిన ఈ ఇద్దరు అంతకుముందు క్రికెట్ ప్రత్యర్థులుగా తమ కెరీర్‌ను ప్రారంభించారని కొద్ది మందికి మాత్రమే తెలుసు. 

సురేష్ రైనా ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ కాగా, ఎంఎస్ ధోనీ జార్ఖండ్‌కు చెందినవాడు. ఈస్ట్ జోన్ vs సెంట్రల్ జోన్ మ్యాచ్‌లో వీరిద్దరూ మొదటిసారి తలపడ్డారు. 2004-05 దులీప్‌ ట్రోఫీ సీజన్‌లో రైనా సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. ఈస్ట్ జోన్‌కు ధోనీ ఆడాడు. అప్పుడు జరిగిన ఓ సంఘటనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ సందర్భంగా రైనా గుర్తు చేసుకున్నాడు. ధోనీ పొడవాటి జుట్టును చూసి.. ఆ అతడు ఏం ఆడుతాడని తమ జట్టు సభ్యులు అనుకున్నారని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో మహీ షాట్లు అందరూ షాక్ అయ్యారని తెలిపాడు. 

జియో సినిమా ప్రత్యేక షో ‘మై టైమ్ విత్ ధోనీ’ కొత్త ఎపిసోడ్‌లో సురేష్ రైనా.. ఎంఎస్ ధోనీని మొదటిసారి చూసిన క్షణాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'సెంట్రల్ జోన్ జట్టుకు మొహ్మద్ కైఫ్ నాయకత్వం వహించగా.. ఎంఎస్ ధోనీ ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జార్ఖండ్‌కు చెందిన పొడవాటి జుట్టు కలిగిన ఆటగాడు మహీ గురించి మేము అప్పటికే చాలా విన్నాం. నిలకడగా భారీ సిక్సులు బాదుతాడని, బంతులు మైదానం ధాటి పోతాయని అందరూ గొప్పగా చెప్పేవారు. ఓ రోజు ధోనీ భాయ్ ప్రశాంతంగా కూర్చొని రోటీ, బటర్‌ చికెన్‌ తింటున్నాడు. అప్పుడు అతడిని మేం చూసాం' అని రైనా తెలిపాడు. 

'రోటీ, బటర్‌ చికెన్‌ తింటున్న ఎంఎస్ ధోనీని చూసి.. మా ప్లేయర్ జ్ఞాను (జ్ఞానేంద్ర పాండే) భాయ్ స్పందించాడు. 'అతడు మనల్ని ఇబ్బంది పెడతాడని నేను అస్సలు అనుకోవట్లేదు. అతను చాలా ప్రశాంతంగా తన తిండిని ఆస్వాదిస్తున్నాడు. అతన్ని అలా చేయనివ్వండి' అని అన్నాడు. తర్వాతి రోజు మ్యాచ్‌ ఆరంభంలోనే ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. భారీ భారీ సిక్స్‌లు బాదాడు. అప్పుడు జ్ఞాను భాయ్‌ తన మాటలను వెనక్కి తీసుకోన్నాడు' అని సురేష్ రైనా చెప్పాడు. ఐపీఎల్ 2023 (IPL 2023) మార్చి 31న ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే. 

Also Read: IPL 2023: ఆర్‌సీబీకి భారీ షాక్.. గాయాలతో ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్‌! వైఫల్యాల పరంపర తప్పదా  

Also Read: Samyuktha Menon Pics: హాట్ ట్రీట్ ఇచ్చేసిన సంయుక్త మీనన్.. మునుపెన్నడూ చూడని హాట్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News