ముస్లిం రిజర్వేషన్లకు మద్దతిస్తూ శివసేన సంచలన నిర్ణయం

                                      

Last Updated : Aug 1, 2018, 04:07 PM IST
ముస్లిం రిజర్వేషన్లకు మద్దతిస్తూ శివసేన సంచలన నిర్ణయం

హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ శివసేన ముస్లిం రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల తరహా ముస్లిం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశానికి మద్దతు పలికింది. మరాఠా రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. రిజర్వేషన్ల అంశంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర సర్కార్ అమలు చేయకపోవడాన్ని శివసేన తప్పుబట్టంది. ముస్లిం రిజర్వేషన్ల పాటు ఇతర రిజర్వేషన్ల డిమాండ్లపై కూడా కరసత్తు చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ కు ఉధ్దవ్ థాక్రే సలహా ఇచ్చారు.

ముస్లింలకు చేరువయ్యే వ్యూహం

హిందుత్వ పార్టీగా గుర్తింపు పడ్డ శివసేన పార్టీ ముస్లింలకు అనుకులంగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఇప్పటి వరకు బీజేపీతో దోస్తీ చేసి ముస్లిం మైనార్టీలకు దూరమైన శివసేన... మళ్లీ ఆ వర్గానికి చేరువయ్యే వ్యూహంలో భాగంగా ముస్లిం రిజర్వేషన్ల అంశానికి శివసేన మద్దతు తెలిపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రతివిషయంలో బీజేపీకి తీరును ఎండగడుతున్న శివసేన .. ఫడ్నవిస్ సర్కార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రయోగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శివసేన నిర్ణయంపనై ఐఎంఎం హర్షం

ముస్లిం రిజర్వేషన్లపై శివసేన తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించింది.  ముస్లింలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను శివసేన పార్టీ గుర్తించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం స్థితిగతులను గుర్తించి బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఫడ్నవిస్ సర్కార్ బేఖారతు చేస్తోందని ఎంఐఎం ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేసీ సర్కార్ కు పడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

Trending News