BJP Campaign Song: నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలుసు. గోల్డెన్ గ్లోబ్ టు ఆస్కార్ అవార్డు జర్నీలో నాటు నాటు పాట ఖ్యాతి మరింత పెరిగింది. అందుకే కర్ణాటక ఎన్నికల వేళ ఆ పాటను వాడేసుకుంటోంది అధికార బీజేపీ. నాటు నాటు కాదు..మోది ..మోది అంటూ అదే బీట్తో దుమ్ము రేపుతోంది.
ఎన్నికళ వేళ ఆస్కార్ అవార్డు పాటల్ని వాడుకోవడం భారతీయులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనుకుంటా. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆస్కార్ అవార్డు పాట జయహోను వాడుకుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ నాటు నాటు పాటతో దుమ్మ రేపేందుకు ప్రయత్నిస్తోంది. మరోసారి అధికారంలో రావాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ అన్ని మార్గాల్ని అవలంభిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ చరిష్మానే నమ్మకుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో కర్ణాటక సందర్శించిన ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు.
ఇప్పుడు ప్రజల్లో నాటు నాటు పాటకు ఉన్న ఆదరణను వాడేసుకోవాలని నిర్ణయించేసుకుంది. నాటు నాటు కాస్తా మోది మోది అయిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను రీమిక్స్ చేసి మోది మోదిగా విడుదల చేసింది కర్ణాటక బీజేపీ. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ పాట సాగుతుంది. నాటు నాటు స్థానంలో మోది మోది అనే బీట్తో నలుగురు కలిసి దుమ్ము రేపుతూ డ్యాన్స్ చేస్తుంటారు. ఇవాళ విడుదలైన ఈ సాంగ్ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల వేళ హల్చల్ చేస్తోంది.
ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ @narendramodi ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ನಮ್ಮ ಡಬಲ್ ಎಂಜಿನ್ @BJP4Karnataka ಸರ್ಕಾರವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೈಗೊಂಡಿರುವ ಅಭಿವೃದ್ಧಿಯ ಪರ್ವವನ್ನು ಅದ್ಭುತವಾದ ಹಾಡಿನ ಮೂಲಕ ಜನರಿಗೆ ತಲುಪಿಸುವ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವ @BJYM ಪ್ರಯತ್ನ ಶ್ಲಾಘನೀಯ. pic.twitter.com/CCi9BBoGyp
— Dr Sudhakar K (@mla_sudhakar) April 11, 2023
కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీయూలు ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి. గత మూడేళ్ల బీజేపీ పాలనలో శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో లైన్ ఇతర పథకాల గురించి పాటలో వివరించారు.
Also read: CR Rao: 102 ఏళ్ల వయసులో సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook