Viral Video: రోడ్ల మీద చితకబాదుకున్న స్కూల్ విద్యార్థినులు..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..! 

Bengaluru School Girls Fight: ప్రస్తుతం విద్యార్థులపై సోషల్‌ మీడియా ప్రభావం ఏ మేర ఉందంటే..?  ఇటివలే బెంగళూరులో జరిగిన విద్యార్థినుల కొట్టుకునుడు చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో కొందరు స్కూల్ డ్రెస్‌లో ఉండి మరికొందరు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 08:03 PM IST
  • బెంగుళూరులో రోడ్ల మీద చితకబాదుకున్న స్కూల్ విద్యార్థినులు
  • విచక్షణ రహితంగా చితకబాదుతున్న విద్యార్థినులు
  • నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
 Viral Video: రోడ్ల మీద చితకబాదుకున్న స్కూల్ విద్యార్థినులు..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..! 

Bengaluru School Girls Fight: ప్రస్తుతం విద్యార్థులపై సోషల్‌ మీడియా ప్రభావం ఏ మేర ఉందంటే..?  ఇటివలే బెంగళూరులో జరిగిన విద్యార్థినుల కొట్టుకునుడు చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో కొందరు స్కూల్ డ్రెస్‌లో ఉండి మరికొందరు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. అయితే వారి మధ్య ఏం జరిగిందో కాని ఒకరికొకరు జుట్లు పట్టుకొని వీపులు విమానం మోత మొగించుకున్నారు. విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

బెంగుళూరులో ఓ స్కూల్‌ ముందు విద్యార్థినులు ఒక గుంపుగా ఏర్పడ్డారు. ఈ గొడవ వీడియోలోని విద్యార్థునులను గమనిస్తే రెండు పాఠశాలలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్‌లు ఉన్నాయి. అయితే గొడవకు గల కారణాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు. గొడవకు గల కారణాలు వ్యక్తగత కారణాలే అని తెలుస్తోంది. రెండు స్కూల్‌లకు సంబంధించిన విద్యార్థునులు కావడంతో అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపే అవకాశాలున్నాయి.

 

 ఈ రెండు పాఠశాలల విద్యార్థునుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు ఏ ఒక్కరూ కూడా వెళ్లలేదు. ఇంత జరిగిన ఈ ఘటనపై అధికారులు కానీ..పాఠశాల సిబ్బంది కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ మాత్రం లవ్‌ విషయంలో తలెత్తిందని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

ఇటీవలే ఇలాంటి ఓ ఘటన:
 
మే 1వ తేదిన త‌మిళ‌నాడులోని మ‌ధురైలో కూడా ఇదివరకు ఇలాంటి ఘటన జరిగింది.  మ‌ధురై బస్‌స్టాండ్‌లో అమ్మాయిలు గుంపుగా ఏర్పాడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో వారు విచక్షణ రహితంగా కర్రలతో జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Minister KTR In London: కేటీఆర్‌కు లండన్‌లో ఘన స్వాగతం

Also Read:Cholesterol control Food: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి..గుండె ఫిట్‌గా ఉంటుంది..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News