Viral Video: కదులుతున్న రైల్లో స్టంట్‌ చేశాడు... పోల్ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు..

Viral Video: ఇంటర్నెట్ వచ్చినా తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఓ యువకుడు రైల్లో స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 12:30 PM IST
Viral Video: కదులుతున్న  రైల్లో స్టంట్‌ చేశాడు... పోల్ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు..

Ludhiana Man Train Stunt Video Viral: కొంత మంది యువకుల చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రిస్కీ  స్టంట్‌లు చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కదులుతున్న రైళ్లలో విన్యాసాలు చేసి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతుంది. ఆ వ్యక్తి మాల్వా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  ఈ ఘటన పంజాబ్‌ లూథియానా జిల్లా ఖన్నాలోని చావా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే...
వీడియో ఓపెన్ చేస్తే... ఓ వ్యక్తి ట్రైన్ లో మెట్ల దగ్గర వేలాడుతూ కనిపిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి తల స్తంభానికి తగలడంతో కింద పడిపోయి మరణిస్తాడు. ఈ ఘటన  అక్టోబరు 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మెుదట మెట్ల దగ్గర కూర్చుని పడిపోయినట్లు పోలీసులు భావించారు.

అయితే వీడియో వైరల్ అవ్వడంతో కదులుతున్న రైలులో విన్యాసాలు చేస్తూ ఆ వ్యక్తి మరణించినట్లు ధృవీకరించారు. అయితే వైరల్ అయిన వీడియో కేవలం 17 సెకన్ల మాత్రమే ఉంది. మరణించిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద టికెట్ కానీ లేదా మెుబైల్ ఫోన్ కానీ లేనందున అతడి ఎవరనేది నిర్ధారించలేకపోతున్నామని పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 ఏళ్లు ఉండచ్చని వారు తెలిపారు. 

Also Read: Burning Train: కదులుతున్న రైలింజన్‌లో మంటలు, భయంతో జనం పరుగులు, ఆ తరువాత ఏమైంది 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News