Huge King Cobra In Washing Machine Video Watch Here: చాలా మంది పాములు చూడగానే అర్థ కీలోమీటర్ దూరం పరిగెడతారు. అంతేకాకుండా కొన్ని యానిమల్స్ సైతం అడవుల్లో వాటిని చూసి ఎంతో దూరం పరిగెత్తడం మనం డిస్కవర్ ఛానెల్‌లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ప్రస్తుతం కాలుష్యం కారణంగా కొన్ని చోట్ల ఆడవులు ఎండిపోతున్నాయి.. దీని కారణంగా ఆహార కోరత ఏర్పడుతూ వస్తోంది. అయితే చాలా జంతువులు ఆహారం లభించే జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో పాములు కూడా ఇలా వస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు ఆటవికి దగ్గరగా ఉండే ఇళ్లలోకి వెళ్తున్నాయి. ఇలా చొరబడుతున్నప్పుడు సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలే కూడా ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఓ కింగ్ కోబ్రా ఇంట్లోకి చొరబడుతుంది. అయితే ఇదే క్రమంలో వాషింగ్ మెషిన్‌లోకి వెళి.. అందులోనే పడగవిప్పి అటు ఇటు ఆడడం గమనించవచ్చు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఓ జిల్లాలో జరిగింది. ఓ మహిళ తన బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేసేందుకు వెళ్తుంది. ఇంతలోనే వాషింగ్ మెషిన్‌పై ఉండే డోర్‌ని ఓపెన్ చేసి అందులో చూస్తుంది. దీంతో ఆ మహిళలకు షాకింగ్ దృశ్యాలు కనిపిస్తాయి. అందులో కింగ్ కోబ్రా బుసలు కోడుతూ ఉండడం కనిపిస్తుంది. అయితే ఆ మహిళ దానిని చూసి కేకలు వేసి పరిగెడుతుంది.
#Watch : कोटा शहर में एक शख्स के तब होश उड़ गए जब उसने कपड़े साफ करने के लिए वॉशिंग मशीन का ढक्कन हटाया। शख्स ने जब वॉशिंग मशीन का ढक्कन खोला तो उसमें फन फैलाए बड़ा सा कोबरा बैठा था। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।#Snake #Kota #Rajasthan pic.twitter.com/elTFnfJ4ht
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) August 20, 2024
ఇంతలోనే ఆ మహిళ జరిగన ఘటనను స్థానికులకు తెలిజేయగా.. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు స్నేక్ క్యాచర్స్ ఫిర్యాదు చేశారు. అయితే వారు వెంటనే అక్కడి చేరుకుని ఈ పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ స్నేక్ క్యాచర్స్ చాలా వరకు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము మాత్రం వారిని చాలా సార్లు దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇలా కొంత సమయం తర్వాత ఈ కింగ్ కోబ్రా వారికి లొంగిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఫ్లాట్ ఫామ్ X ద్వారా షేర్ అవుతోంది. దీనిని Rahul kumar Vishwakarma అనే ఖాతా నుంచి సోషల్ మీడియాకు వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే చాలా మంది ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పాములు ఇంట్లో దూరినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు వహించాలని కొంతమంది చెబుతున్నారు. ఇంకొందరైతే..ఈ పాము చాలా ప్రమాదకరమని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook