Girls Fighting Video: అబ్బాయిలే అనుకుంటాం గానీ..అమ్మాయిలు అంతకంటే దారుణంగా కొట్టుకుంటారు. అదే జరిగింది కాన్పూర్‌లో. స్కూల్ విద్యార్ధినులు ఒకరి నొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంటుంది. కొన్ని ఫన్నీ వీడియోలైతే..మరికొన్ని సీరియస్ వీడియోలుంటాయి. సాధారణంగా జంతువుల కోట్లాటకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక్కడ మాత్రం అమ్మాయిల కోట్లాట వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో కాన్పూర్‌లోని ఓ ప్రసిద్ధ ప్రైవేట్ స్కూల్ తరగతి గదిలో జరిగిన వ్యవహారానికి సంబంధించినది. ముగ్గురు అమ్మాయిలు స్కూల్ యూనిఫాంలో అత్యంత దారుణంగా, హింసాత్మకంగా కొట్టుకుంటున్నారు. అది కూడా ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని..బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. ఓ వైపు కొట్టుకుంటూ బెంచీలపై పడుతూ లేస్తూ మరీ కొట్టుకున్నారు. పక్కనున్న అమ్మాయిలు వదలమని చెబుతున్నా విన్పించుకోలేదు. కొంతమంది కలగజేసుకున్నా ఫలితం లేకపోయింది.
कानपुर में एक नामी निजी स्कूल की इन लड़कियों की ये पटकम-पटकाई का वीडियो खूब वायरल हो रहा है। हाईस्कूल की ये स्टूडेंट्स स्कूल ऑवर्स में ही एक दूसरे से भिड गईं।#Kanpur pic.twitter.com/BQGyza6Rqd
— Amit Singh (@amit3_singh) August 27, 2022
అమిత్ సింగ్ అనే జర్నలిస్ట్ ఈ వీడియోనూ ట్విట్టర్‌లో షేర్ చేయగా..భారీగా వైరల్ అవుతోంది. స్కూల్ సమయంలో క్లాస్‌రూమ్‌లో కొట్టుకుంటున్నారని రాశాడు. ఈ వీడియోను అప్పుడే 85 వేలమంది వీక్షించారు. 3 వందలమంది రీ ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫన్నీగా, సీరియస్‌గా కామెంట్లు పెడుతున్నారు.
Also read: Team India Kala Chashma: టీమిండియా కాలా చష్మా డాన్స్.. ఇరగదీశిర్రు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook