Independent Candidate Rides Donkey To File Nomination: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోల ప్రకటనలతో ఎన్నికల మూడ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హీట్ ఓ రేంజ్లో ఉంది. టికెట్లు దక్కిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారాలు చేస్తున్నారు. తమదైన స్టైల్లో ప్రసంగాలు, విచిత్ర ప్రవర్తనలతో ఆకర్షిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ స్వంతంత్ర అభ్యర్థి గాడిదపై వచ్చి నామినేషన్ దాఖాలు చేశారు. అంతేకాదు మెడలో టమోటాలు, ఉల్లిపాయలు, వంకాయలతో చేసిన దండను ధరించి వచ్చారు.
బుర్హాన్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా ప్రియాంక్ ఠాకూర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. నామినేషన్ నుంచే ప్రజలను ఆకర్షించాలని వినూత్నంగా ప్లాన్ వేశారు. మెడలో కూరగాయల దండ వేసుకుని.. గాడిదపై ఊరేగింపుగా ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బుర్హాన్పూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన బీజేపీ టికెట్‌ను ఆశించారు. అయితే అధిష్టానం తిరస్కరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ప్రియాంక్ ఠాకూర్ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలన్నీ తమకు ఇష్టమైన వారికే టికెట్లు ఇచ్చుకుంటున్నాయని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ప్రజలను గాడిదలుగా తయారు చేస్తున్నారని.. ఈ విషయాన్ని సింబాలిక్‌గా చెప్పేందుకే తాను గాడిదపై నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. తనకు గాడిదను ఎన్నికల్లో చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నానని.. అయితే అది అందుబాటులో లేదని తెలిపారు.
बुरहानपुर में एक निर्दलीय प्रत्याशी गधे पर बैठकर नामांकन दाखिल करने पहुंचे। हिंदू संगठन के पदाधिकारी और निर्दलीय उम्मीदवार ठाकुर प्रियंक सिंह गधे पर बैठकर रिटर्निंग आफिसर के कार्यालय पर पहुंचे। @ABPNews #MadhyaPradesh #MadhyaPradeshElection2023 #burhanpur pic.twitter.com/jth1pE6W2y
— Shaikh Shakeel (@ShakeelABP) October 26, 2023
కాగా.. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేంద్ర సింగ్ షేరా భయ్యా ఎద్దుల బండిపై వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. సాన్వేర్ కాంగ్రెస్ అభ్యర్థి రీన బోరాసి సాన్వెర్ ట్రాక్టర్‌పై, నరేలా బీజేపీ అభ్యర్థి విశ్వాస్ సారంగ్ స్కూటర్‌పై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం విశేషం. మధ్యప్రదేశ్‌లో నామినేషన్ల దాఖలు చేసేందుకు రేపటి వరకే అవకాశం ఉంది. అక్టోబర్ 30వ తేదీతో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది. అనంతరం అక్టోబర్ 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 2వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా
Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి