Marriage Reception: భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం అతలాకుతమవుతోంది. చాలా రాష్ట్రాలు వర్షాలతో వణికిపోతున్నాయి. వరదల ముప్పు పొంచి ఉంది. అయితే ఈ వర్షాల సమయంలో అక్కడ శుభకార్యాలకు కొత్త కష్టం తెచ్చిపెట్టింది. అక్కడ భారీ ఎత్తున శుభకార్యాలు జరుగుతున్నాయి. వర్షాలను లెక్క చేయకుండా వాళ్లు ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫంక్షన్ వెళ్లేందుకు బంధుమిత్రులు సాహసానికి ఒడిగట్టారు. ఫంక్షన్ హాల్ ముందు ప్రాంతమంతా వరదతో నిండిపోయినా కూడా ఆ శుభకార్యానికి హాజరయ్యేందుకు తంటాలు పడ్డారు. మోకాళ్ల లోతు నిండిపోయినా కూడా అలాగే వెళ్లారు. అయితే కొందరు భర్తలు తమ భార్యలను భుజాలపైకి ఎత్తుకుని వెళ్లారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
ఉత్తరప్రదేశ్‌లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడి నదులు, వాగువంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిలిబిత్ ప్రాంతంలో కూడా వరదలు వచ్చాయి. అయితే అక్కడ వివాహ రిసెప్షన్ అప్పటికే నిశ్చయమైంది. రిసెప్షన్ జరిగే ఫంక్షన్ హాల్ ప్రాంతంలో వర్షం రోజులు తరబడి కురిసింది. దీంతో ఫంక్షన్ పరిసరాలు వరదతో నిండిపోయాయి. అయితే ఆ వివాహ విందుకు ఎలాగైనా వెళ్లాలని బంధుమిత్రులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వరదను కూడా లెక్క చేయకుండా ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. అయితే మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. ఫంక్షన్ హాల్‌కు చేరుకోవడంతో పట్టుబట్టలు తడుస్తాయని భావించారు.
Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం
ఈ క్రమంలో వెంటనే భర్తలు వారిని ఎత్తుకుని ఫంక్షన్ హాల్‌లోకి ఎత్తుకుని వెళ్లారు. అక్కడ ఒక పోటీ నిర్వహించినట్టు భర్తలందరూ తమ భార్యలను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి. అంతేకాకుండా తమ పిల్లలను వారి తండ్రులు ఎత్తుకెళ్లారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వర్షమొచ్చినా.. వరదొచ్చినా ఫంక్షన్‌కు వెళ్లాల్సిందే అన్నట్టు వారి ప్రవర్తన ఉంది. ఇది చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు. అంత కష్టపడి వెళ్లడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. విందు అంటే కోసేసుకుంటారు అని కొందరు కామెంట్ చేశారు. 'మీ తిండి తగిలేయా? ప్రమాదకరంగా ఇలాంటి ఫీట్లు అవసరమా?' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షలలో వ్యూస్.. వేలల్లో లైక్స్.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి.
भले ही बाढ़ क्यों ना आ जाए पर भोज नहीं छूटना चाहिए, ये जज़्बा कायम रहे 😜😍 pic.twitter.com/Mr5r48L5Dq
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 10, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter