సోషల్ మీడియా (Social Media) చాలా ఇంట్రెస్టెంగ్ ప్లాట్ ఫామ్. ఇక్కడ ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కాస్త ఈ బాతును (Duck) చూడండి. ఇది చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు. కానీ దీనికి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఇది ఎక్కడా రాజీపడేలా లేదు. వర్కవుట్ విషయంలో మనం రేపటి నుంచి పక్కాగా చేస్తాం అనేది ప్రతీ చెబుతూ ఉంటాం. కానీ ఈ బాతు మాత్రం ఫిట్నెస్ (Fitness) అంటే ఎంత ఇష్టమో దాని వీడియోను చూస్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు.
Sunday Mood... pic.twitter.com/q5uy8JaOzh
— Susanta Nanda IFS (@susantananda3) August 30, 2020
ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్
వైరల్ అవుతున్న బాతు వీడియో
బాతు వర్కవుట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడీయోలో మీరు ఒక బాతును చూడవచ్చు. దీనికి వ్యాయామం అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. అందుకే ఆటోమెటిక్ రన్నింగ్ మెషిన్ కనిపించగానే అది వెంటనే ఎక్కిపోతుంది. అచ్చం ప్రొఫెషనల్ లా రన్నింగ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజెన్లు ఇక నుంచి బాతులా రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అని కామెంట్ చేస్తున్నారు.
ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం
సోషల్ డిస్టెన్సింగ్ ను సీరియస్ గా తీసుకున్న శునకం
ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. కరోనావైరస్ ( Coronavirus ) నుంచి రక్షణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్ ధరించమని, శానిటైజర్ తో లేదా సబ్బుతో తరచూ చేతిని కడగాలి అని, దాంతో పాటు బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అని చెప్పింది. ఈ విషయాన్ని మనషులతో పాటు ఈ కుక్క కూడా బాగా పాటిస్తోంది. అయితే తను వస్తూ వెళ్తూ ఉంటే మనుషులు జరగడం లేదు అని ఇలా కర్ర పట్టుకుని జనాల నుంచి దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తోందేమో. వీడియో చూసి దీనికి కోవిడ్-19 నియమాలు బాగా తెలుసు అనుకుంటా అందుకే ఇలా చేస్తోంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.
He took social distancing very seriously pic.twitter.com/kdG9arbGll
— Welcome To Nature (@welcomet0nature) September 20, 2020
Nature Wonders: 5 Colors లో ప్రవాహించే నీటి ధారా.. నేచురల్ వండర్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR