Shukra Gochar 2023: నవంబర్‌లో ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2023: గ్రహాలు కాలనుగుణంగా రాశులను మారుస్తాయి. వచ్చే నెలలో శుక్రుడు ప్రస్తుత రాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 01:29 PM IST
Shukra Gochar 2023: నవంబర్‌లో ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?

Venus Transit 2023 in November:  వచ్చే నెల ప్రారంభంలో కొన్ని గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నవంబరు 03న కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం ఉదయం 4:58 గంటలకు జరగబోతుందని తెలుస్తోంది. నవంబరు 29 వరకు శుక్రుడు అదే స్థానంలో ఉంటాడు. శుక్రుడి రాశి మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్యా రాశి
ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో మీకు కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. 
కర్కాటక రాశి
శుక్రుడు కన్యారాశి ప్రవేశం కర్కాటక రాశి వారికి అనుకూలంగా  ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. 
వృశ్చిక రాశి
శుక్రుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారి కెరీర్ బాగుంటుంది. మీకు లక్ కలిసి వచ్చి మీరు ప్రతి పనిని విజయంతంగా పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. 

Also Read: Surya Gochar: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారికి సమస్యలు ప్రారంభం..మీ రాశి కూడా ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News