Astro Tips: గ్రహణయోగం ఉంది తస్మాత్ జాగ్రత్త, ఆ రెండు రాశులవాళ్లకు రేపట్నించి కష్టాలే

Astro Tips: చంద్ర, రాహు గ్రహాల కలయికతో ఏర్పడనున్న గ్రహణ యోగంతో చాలా అనర్ధాలు జరగనున్నాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృషభం, కన్యారాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2022, 07:16 PM IST
Astro Tips: గ్రహణయోగం ఉంది తస్మాత్ జాగ్రత్త, ఆ రెండు రాశులవాళ్లకు రేపట్నించి కష్టాలే

Astro Tips: చంద్ర, రాహు గ్రహాల కలయికతో ఏర్పడనున్న గ్రహణ యోగంతో చాలా అనర్ధాలు జరగనున్నాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృషభం, కన్యారాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

చంద్రుడు, రాహువు గ్రహాల కలయికతో గ్రహణ యోగం ఏర్పడనుంది. ఈ యోగం ఆగస్టు 16వ తేదీ రాత్రి 9 గంటల 6 నిమిషాల్నించి ఆగస్టు 19వ తేదీ 6 గంటల 7 నిమిషాలవరకూ ఉంటుంది. చంద్ర, రాహు గ్రహాల ప్రభావం నుంచి విముక్తి పొందేందుకు 2-3 రోజులు పట్టవచ్చు. కుండలిలో చంద్రుడి ప్రభావం కీలకంగా ఉంటుంది. చంద్రుడు ఎప్పుడుూ మనస్సుకు ప్రాతినిద్యం వహిస్తాడు. రాహువుతో చంద్రుడు కలవగానే చంద్రుడు కాస్తా దూషితమౌతాడు. ఫలితంగా చంద్రుడు బలహీనమై అన్ని రాశులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కొన్ని రాశులపై శుభం కలగనుంది. అయితే వృషభం, కన్యారాశివారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

వృషభరాశి జాతకులు రెండ్రోజులపాటు అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఏదైనా ప్రయాణం అంతగా అవసరం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇతరుల ప్రభావంలో పడకూడదు. అయినవారితో వివాదాలను దాటేసేందుకు ప్రయత్నించాలి. నిద్రలేమికి గురి కాకుండా జాగ్రత్త పడండి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లవద్దు.

కన్యారాశి జాతకులు ఆరోగ్య సంబంధిత వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ..ఆందోళన చెందడం వల్ల మనసు పాడయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్తమానంలో ఆనందం పొందేందుకు ప్రయత్నించాలి. కడుపు సంబంధిత సమస్యలు, కఫం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తినే ఆహారంపై తేలిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. మాంసాహారం, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి. 

Also read: Tricolour Astrology: త్రివర్ణ పతాకంలోని రంగులకు, ఆస్ట్రాలజీకి గల సంబంధం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News