Horoscope Today May 8 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగంలో బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఊహల్లో విహరించడం మాని చదువుపై శ్రద్ధ పెట్టాలి. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఇంకా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేషరాశి ( Aries)
ఇవాళ చంద్ర అనుగ్రహంతో అన్ని పనులు పురోగతిలో ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా బాగా రాణిస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. కష్టంలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రులతో కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అమ్మవారిని పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి (Taurus)
ఇవాళ సాయంత్రం వరకు మిమ్మల్ని అసహనం వెంటాడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అది పనిపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. అనవసర విషయాలపై ఫోకస్ చేసి మీ శక్తి, సామర్థ్యాలను వృథా చేయవద్దు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారిని అసంతృప్తి వెంటాడుతుంది. విష్ణు సహస్ర నామాలను పఠించడం ద్వారా నెగటివిటీ నుంచి బయటపడవచ్చు.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మీకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మరింత మెరుగవుతుంది. లగ్జరీ బతికేందుకు ఇష్టపడుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటారు. ఈ క్రమంలో కొత్త రుణాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
కర్కాటక రాశి (Cancer)
నోటి దురుసుతనంతో అభాసుపాలు కావొద్దు. కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. లేని పలుకుబడి కోసం పాకులాడి అనవసర వృథా ఖర్చులు చేస్తారు. అయితే మీకు రావాల్సిన బకాయిలు వసూలవడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి సానుకూలంగా ఉంటుంది.
సింహ రాశి (LEO)
పిల్లల చదువులపై ఫోకస్ చేస్తారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించి పిల్లల భవిష్యత్తుకై ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తారు. చదువుల్లో మీ పిల్లలు గొప్పగా రాణించడం మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఇవాళ మీరు హాజరుకావాల్సిన కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పడతాయి. ఆస్తులు కొనుగోలుకు అనువైన సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు, ఉద్యోగ రంగాల్లో కొత్త తలనొప్పులు మొదలవుతాయి.
కన్య రాశి (Virgo)
మానసిక ప్రశాంతత కొరవడుతుంది. రిస్క్‌తో కూడిన స్థిరాస్తి కొనుగోళ్లకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్య రీత్యా బాగుంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరమైన చర్చలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో సన్నిహితుల సలహా కోరుతారు. మీ పరిచయాలు మరింత పెరుగుతాయి. కొత్త వెంచర్స్‌కి ప్లాన్ చేస్తారు. దూరపు బంధువు ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లే అవకాశం.
తులా రాశి (Libra)
మీ జీవిత భాగస్వామి నుంచి ఏదీ దాచేందుకు ప్రయత్నించవద్దు. ఒకవేళ ఏదైనా దాచాలని చూస్తే అది మిమ్మల్ని ఆమెకు దూరం చేస్తుంది. సంసార జీవితంలో మనస్పర్థలు ప్రశాంతతను దూరం చేస్తాయి. ముక్కుసూటితనం కాస్త తగ్గించుకుంటే మంచిది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొందరు ప్రముఖులతో అనుకోని పరిచయాలు కలుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీరు చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. మీ లక్ష్యం దిశగా ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఏ శక్తి నిలువరించలేదు. మీలో నూతనోత్సహం వెల్లివిరిస్తుంది. కొన్ని విషయాల్లో రకరకాల ఆలోచనలు మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వవు. బంధువర్గంతో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
విద్యార్థుల్లో ఊహల్లో విహరించడం మాని చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పని భారం కారణంగా కాస్త అలసటకు గురవుతారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మళ్లుతారు.
మకర రాశి (Capricorn)
ఇవాళ మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన పనిని ఎట్టకేలకు పట్టాలెక్కిస్తారు. చాలా ఓర్పుగా, నేర్పుగా వివాదాలను పరిష్కరించుకోగలరు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆలయాలు లేదా స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. మిమ్మల్ని సాయం కోరేవారిని కాదనరు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు మీకు కలిసొస్తాయి.
కుంభ రాశి (Aquarius)
మీకు కావాల్సిన వారి నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని లక్ష్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారం పరుగులు పెడుతుంది. కొత్త ఆర్డర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధ్యానం, యోగ ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రతను పొందుతారు.
మీన రాశి (Pisces)
ఆరోగ్యపరంగా బాగుంటుంది. చాలా కాలంగా ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మరింత ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపార రీత్యా కొత్త వ్యక్తులతో సమావేశమవుతారు. వారి సలహాలు, సూచనలు మీకు కలిసొస్తాయి.
Also Read: Sarkaru Vari Pata Movie: సర్కార్ వారి పాట మూవీ ప్రీ రిలీజ్..అదరహో...!
Also Read: HDFC Interest Rate: లోన్స్ తీసుకునేవారికి నిరాశే, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.