చంద్ర గ్రహణం ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన ఉంది. సూర్య గ్రహణం ముగిసిన 15 రోజుల్లోనే చంద్ర గ్రహణం ఉండటం జ్యోతిష్యం ప్రకారం దుష్ప్రభావం చూపించనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
నవంబర్ 8వ తేదీన ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుంది. భారతదేశంతో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం ప్రాంతాల్లో చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈసారి నవంబర్ 8న ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఈ ఏడాది చివరిది కావడమే కాకుండా..కార్తీక పౌర్ణిమ నాడు వస్తోంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. నవంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తరువాత ప్రారంభమై..6 గంటల 19 నిమిషాలవరకూ ఉంటుంది. అంటే గంటన్నర సేపు ఉంటుంది.
రెండు గ్రహణాల ప్రభావం
జ్యోతిష్య పండితుల ప్రకారం 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాల ప్రభావం ప్రపంచం మొత్తంపై పడనుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు లేదా వాతావరణంలో ఆకస్మిక మార్పులు రావచ్చు. దేశాల మధ్య ఆందోళన పెరుగుతుంది. రెండు దేశాల మద్య సరిహద్దు వివాదం ఏర్పడవచ్చు. అభివృద్ధి మందగిస్తుంది. వ్యాపార వర్గాలపై ప్రభావం పడుతుంది.
చంద్ర గ్రహణం విషయంలో జాగ్రత్తలు
మత గ్రంధాల ప్రకారం ఇదొక అశుభ ఘటన. ఇది మన జీవితంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించనుంది. అందుకే గ్రహణ దుష్పరిణామాల్నించి రక్షించుకునేందుకు కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. గ్రహణకాలంలో ఆలయాలు మూసివేస్తారు. హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు. గ్రహణం ప్రారంభమయ్యేముందు ఆహార పదార్ధాల్లో తులసి ఆకులు వేసి ఉంచాలి. గ్రహణం పూర్తయిన తరువాత..బయట పాడేయాలి. చంద్ర గ్రహణం తరువాత స్నానం చేసి..ఇంట్లో గంగాజలం స్ప్రే చేయాలి.
Also read: Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో తప్పకుండా చేయాల్సిన 5 పనులు, కలిగే ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Lunar Eclipse 2022: నవంబర్ 8న చంద్ర గ్రహణం, 15 రోజుల్లో రెండు గ్రహణాల ప్రభావం ఎలా