Name Astrology: అమ్మాయిలకు ఈ అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్త వస్తే చాలా లక్కీ!

Name Astrology: పేరులో మొదటి అక్షరాన్ని బట్టి జ్యోతిష్యులు ఆయా వ్యక్తుల స్వభావాన్ని చెబుతుంటారు. దీనితో పాటు అమ్మాయిలకు ఏ పేరున్న అబ్బాయి వస్తే జీవితం ఆహ్లాదంగా ఉంటుందో చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 03:23 PM IST
  • జ్యోతిష్యంలో పేరు జ్యోతిష్యానికి ప్రత్యేక స్థానం
  • పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తుల స్వభావం..
  • భార్యనును ప్రేమించే అబ్బాయిల పేర్లు ఏ అక్షరాలతో ప్రారంభమవుతాయంటే..
Name Astrology: అమ్మాయిలకు ఈ  అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్త వస్తే చాలా లక్కీ!

Name Astrology: జ్యోతిషశాస్త్రంలో వివిధ శాఖలు ఉన్నాయి. అందులో 'పేరు జ్యోతిష్యం' కూడా ఒకటి. దీని ప్రకారం పేరులో మొదటి అక్షరం ద్వారా ఆ స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంటారు జ్యోతిష్య నిపుణులు. అంతే కాదు.. ఆ వ్యక్తి బలాలు, బలహీనతలు కూడా చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. పెళ్లి చేసుకునే అమ్మాయిలు తాము చేసుకోబోయే వాడు తమను అత్యంత ప్రేమగా చూసుకోవాలని భావిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేరున్న అబ్బాయిలు తమ జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు. మరి ఆ అక్షరాలు ఏవి? భార్యను ప్రేమించడంలో ఎవరి ప్రత్యేకత ఎలా ఉంటుంది? తెలుసుకుందాం.

ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిల స్వభావం ఇలా ఉంటుంది.

A అక్షరంతో పేరు మొదలైతే: ఇలాంటి అబ్బాయిలు తమ భార్యను కళ్లల్లో పెట్టుకుని ఆరాదిస్తారట. భార్య పట్ల అత్యంత ప్రేమతో ఏది కావాలన్నా చేసిపడతాడని చెబుతున్నారు జ్యోతిష్యులు.

పేరు మొదటి అక్షరం P అయితే: Pతో పేరు మొదలయ్యే అబ్బాయిలు ఎల్లప్పుడూ భార్యకు విధేయులుగా ఉంటారు. అంతే కాదు.. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు భార్యను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు.

Kతో పేరు మొదలయ్యే వ్యక్తులు: ఇలాంటి అబ్బాయిలు ఎప్పుడు తమ భాగస్వామికి మద్దతుగా ఉంటారు. భార్యత నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని భావిస్తుంటారు.

పేరులో మొదటి అక్షరం R అయితే: ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తులు తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. అయితే వీరు బహిరంగంగా ఆ విషయాన్ని ప్రదర్శించేందుకు ఇష్టపడరు.

S అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు: S అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలి తమ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామి సంతోషం కోసం ఏంత దూరమైన వెళ్తారు. ఎంతైనా చేస్తారు.

పేరులో మొదట V ఉంటే: V అక్షరంతో పేరు మొదలవుతే: వారు తమ ప్రియ సఖి కోరకను కాదనలేరు. అంతే కాకుండా చాలా రొమాంటిక్​గా ఉంటారు. భార్యకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా బాగా గుర్తుంచుకుంటారు.

(నోట్​: ఇందులోని సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఈ విషయాలను ZEE తెలుగు NEWS ధ్రువీకరించలేదు.)

Also read: Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!

Also read: Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ..? ఆ రాశులకు అనుకూలం, ఈ రాశులకు ప్రతికూలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News