Shukra Mahadasha effect: లవ్, రొమాన్స్, డబ్బు మరియు లగ్జరీ లైఫ్ కు శుక్రుడి కారకుడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికీ ఎటువంటి లోటు ఉండదు. మీ లైఫ్ పార్టనర్ పై ప్రేమ ఎప్పడూ చెక్కుచెదరకుండా ఉంటుంది. మీ కుండలిలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే మీరు పేదరికంలో కూరుకుపోతారు.
శుక్ర మహాదశ మంచి ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం యొక్క మహాదశ చాలా కాలం పాటు అంటే 20 సంవత్సరాల పాటు ఉంటుంది. జాతకంలో బలమైన శుక్రుడు మిమ్మల్ని ధనవంతుడుగా చేస్తాడు. అంతేకాకుండా శుక్రుని మహాదశ మిమ్మల్ని అపారమైన సంపదకు యజమానిని చేస్తుంది. మీరు ప్రపంచంలోని అన్ని సుఖాలను పొందుతాడు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. అతని జీవితంలో ప్రేమ మరియు రొమాన్స్ ఉంటాయి.
శుక్ర మహాదశ చెడు ప్రభావం
మరోవైపు, ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుక్ర గ్రహం అశుభ (నీచ) స్థానంలో కూర్చుంటే అతను చాలా చెడు ప్రభావాలను అనుభవించవలసి ఉంటుంది. శుక్రుడు క్షీణించడం వల్ల మనిషి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ జీవితం కష్టాలమయంగా ఉంటుంది. . స్త్రీల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. మరోవైపు, పురుషులకు మూత్రపిండాలు మరియు కళ్ళకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
శుక్రగ్రహ దోషం పోగొట్టే పరిహారాలు
>> కుండలిలో శుక్ర దోషం ఉన్నవారు దాని నుండి విముక్తి పొందడానికి ప్రతిరోజూ కనీసం 108 సార్లు 'శున్ శుక్రాయ నమః' లేదా 'శున్ శుక్రే నమః' అని జపించాలి.
>> శుక్రవారం నాడు పాలు, పెరుగు, నెయ్యి, కర్పూరం, తెల్లని ముత్యాలను అవసరమైన వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి దానం చేయండి.
>> ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించండి. అనంతరం ఖీర్ ను ప్రసాదంగా పంచండి.
>> ప్రతి శుక్రవారం చీమలకు పిండి మరియు పంచదార తినిపించండి.
Also Read: Grah Gochar 2023: రెండు దశాబ్దాల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి