ఆసియా కప్ 2018 ఆటగాళ్ల జాబితా : కోహ్లికి విశ్రాంతి, కొత్తగా ముగ్గురికి చోటు

భారత జట్టు ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన బీసీసీఐ

Last Updated : Sep 1, 2018, 06:13 PM IST
ఆసియా కప్ 2018 ఆటగాళ్ల జాబితా : కోహ్లికి విశ్రాంతి, కొత్తగా ముగ్గురికి చోటు

టీమిండియా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ నెల 15 నుంచి జరగనున్న ఆసియా కప్ 2018 కోసం 16 మందితో కూడిన భారత జట్టు సభ్యుల జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ మాత్రమే కాకుండా అంతకన్నా ముందు నుంచే విశ్రాంతి లేకుండా వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్న టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీకి ఈసారి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. శిఖర్ ధావన్‌ను బీసీసీఐ వైస్ కెప్టేన్‌గా ఎంపిక చేసింది. ఆసియా కప్ 2018లో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కేదర్ జాదవ్‌లకు స్థానం లభించింది.

Team India players for Asia cup 2018

భారత జట్టు ఆటగాళ్ల జాబితా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్. 

Trending News