Pakistan In ICC World Cup 2023: ఐసిసి వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ టీమ్ ఇండియాకు రాకుండా బంగ్లాదేశ్‌కి..

Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 05:48 AM IST
Pakistan In ICC World Cup 2023: ఐసిసి వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ టీమ్ ఇండియాకు రాకుండా బంగ్లాదేశ్‌కి..

Pakistan In ICC World Cup 2023: ఐసిసి వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ కి రావడం లేదు. ESPNCricinfo వెల్లడించిన వివరాల ప్రకారం ఐసిసి ప్రపంచ కప్ మ్యాచ్ ల కోసం పాకిస్థాన్ జట్టు భారత్ కి బదులుగా బంగ్లాదేశ్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. గతవారం జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఈ ప్రతిపాదన ఐసిసి ముందుంచింది. ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇటీవల దుబాయ్ లో జరిగిన బోర్డ్ సైడ్ లైన్స్ మీటింగ్ లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. పాకిస్థాన్ ఆతిథ్యం వహిస్తున్న ఆసియా కప్ లో భారత్ పాల్గొనేలా.. అలాగే భారత్ ఆతిథ్యం వహిస్తోన్న ఐసిసి వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ జట్టు పాల్గొనేలా ఉండేందుకు ఐసిసి మీటింగ్ లో ఈ అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. 

ఆసియా కప్ 2023 గురించి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ స్పందిస్తూ.. టీమిండియా జట్టు ఆడే మ్యాచులను పాకిస్థాన్౨లో కాకుండా వేరే దేశంలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు అంగీకరించింది. అయితే ఏ దేశంలో టీమిండియా పాల్గొనే క్రికెట్ మ్యాచులు నిర్వహించాలనే విషయంలో ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. ప్రస్తుతానికి ఏసిసి వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. దుబాయ్, ఒమన్, శ్రీలంక లేదా ఇంగ్లాండ్ దేశాల్లో ఏదైనా ఒక దేశాన్ని ఎంచుకుని భారత జట్టు ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా ఫైనల్స్ వరకు వెళ్తే.. ఆ ఫైనల్ మ్యాచ్ కూడా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే పాకిస్థాన్‌లో కాకుండా ఏదైనా వేరే దేశంలోనే నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి : Kedar Jadhav father missing: ఇండియన్ స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్.. అసలు ఏమైందంటే?

ఇది కూడా చదవండి : Kohli-Anushka: అనుష్క శర్మ.. నేను డ్యాన్స్‌ బాగా చేస్తానా?! నవ్వులు పూయిస్తున్న విరాట్ కోహ్లీ ప్రశ్న

ఇది కూడా చదవండి : South Africa T20I Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా.. ఏకంగా 517 పరుగులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x