India Vs Pakistan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా ప్రకటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉంది. వచ్చే ఏడాది పాక్‌లో జరగబోతున్న ఆసియా కప్‌కు భారత్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్-2023 తటస్థ వేదికపై జరగడం చాలా కష్టమని.. పాక్ పర్యటనకు టీమిండియా వెళ్లకూడదని నిర్ణయించామని జై షా తెలిపారు. భారత జట్టు పాక్ టూర్‌పై తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదానికి తెరలేసింది.
ఈ నేపథ్యంలోనే పాక్ బోర్డు కూడా సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ను భారత్ బహిష్కరిస్తే.. వచ్చే ఇండియాలో నిర్వహించే ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని బెదిరించేందుకు సిద్ధమవుతోంది. జై షా ప్రకటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలో మెల్‌బోర్న్‌లో జరగబోయే ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఆసియా కప్ నుంచి భారత్ తప్పుకుంటే.. జై షా ప్రెసిడెంట్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా తప్పుకునేందుకు పాక్ యోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు బీసీసీఐ ప్రకటనపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. వచ్చే ఇండియాలో జరిగే వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేయాలని వారు పాక్ బోర్డును కోరుతున్నారు. అయితే వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ జట్టు రాకపోతే పోయేదేమి లేదంటూ టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
2023లో వన్డే వరల్డ్ కప్ భారత్‌లో జరగనుంది. అయితే ఈ మెగా ఈమెంట్‌కు ముందే పాక్ వేదిక జరిగే ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ టోర్నీకి భారత్‌ను రప్పించేందుకు పాక్ బోర్డు గట్టిగా ప్రయత్నించేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం టీమిండియా, పాకిస్థాన్ జట్లు టీ-20 వరల్డ్ కప్‌లో తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 23న రెండు జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆసియా కప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోనేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది భారత్.
Also Read: Junaid Siddique Six: బాప్‌రే.. ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్! వైరల్ అయిన యూఏఈ ప్లేయర్ సెలెబ్రేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook