అది 2003 ప్రపంచ కప్. దక్షిణాఫ్రికా గడ్డ మీద.. భారత్- పాకిస్తాన్ రెండు దాయాది దేశాల మధ్య హోరా హోరీగా పోరు జరుగుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని వ్యక్తిగత స్కోరు 98కి చేరింది. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంతలోనే ఓ పేద్ద కుదుపు.
పాకిస్తాన్ బౌలర్, రావల్ఫిండీ ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ విసిరిన బౌన్సర్ బంతికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఔటయ్యాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న షోయబ్ అక్తర్.. ఆనాడు సచిన్ తన చేతిలో ఔటైనందుకు బాధపడ్డాడు. సచిన్ .. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడం బాధించిందన్నాడు. తాను విసిరిన బౌన్సర్ బంతిని ఎప్పటిలానే సిక్సర్ మలుస్తాడని భావించినట్లు పేర్కొన్నాడు. ఐతే ఆ బంతికి సచిన్.. సెంచరీ పూర్తి చేయకుండా పెవిలియన్ బాట పట్టడం.. జట్టుపరంగా సంతోషం కలిగించినప్పటికీ .. వ్యక్తిగతంగా బాధపెట్టిందని తెలిపాడు అక్తర్. ఐతే ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు.
ఆనాటి ఆ మ్యాచ్‌లో తన ఎడమ మోకాలి గాయం కారణంగా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయానని అక్తర్ ఒప్పుకున్నాడు. భారత ఓపెనర్లు సచిన్, వీరేందర్ సెహ్వాగ్ తన బౌలింగ్‌ను చీల్చి చెండాడారని తెలిపాడు. చివరకు ఫాస్ట్, షార్ట్ పిచ్ బంతితో సచిన్ ఇన్నింగ్స్‌కు తెరపడిందన్నాడు. కానీ అలాంటి బంతులను తాను ముందు నుంచే వేసి ఉంటే బాగుండేదన్నాడు. చివరకు ఆ మ్యాచ్ తాము ఓడిపోయామన్నాడు. జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. మంచి బౌలింగ్ లైనప్ ఉండి కూడా 2003 ప్రపంచకప్‌లో ఆ మ్యాచ్ ఓడిపోవడమే అన్నాడు అక్తర్.
చాలా కష్టమైన కాలంతో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడాడని అక్తర్ ప్రశంసించాడు. అంతే కాదు ఇప్పడు బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే లక్షా 30 వేల పరుగులు తీసే సామర్థ్యం సచిన్‌కు ఉందన్నాడు. సచిన్ ను విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని స్పష్టం చేశాడు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..