Robin Minz ruled out of IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీనికి ముందే గుజరాత్, రాజస్థాన్ టీమ్స్ లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది జరిగిన వేలంలో యువ వికెట్‌కీపర్-బ్యాటర్ రాబిన్ మింజ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.3.60 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లతో పోటీపడి మరి అతడిని దక్కించుకుంది. మింజ్ ఐపీఎల్ లో ఆడిన తొలి గిరిజన ఆటగాడు.
అయితే ఈ నెల ప్రారంభంలో అతడికి బైక్ యాక్సిడెంట్ అయింది. అయితే ఆ గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ.. రిస్క్ తీసుకోకూడదని గుజరాత్ యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగానే.. మింజ్ స్థానంలో బీఆర్ శరత్‌ను తీసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన శరత్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను 28 టీ20లు, 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 43 లిస్ట్-ఏ గేమ్‌లు ఆడాడు. శరత్ టీ20 క్రికెట్లో 328 పరుగులు చేశాడు దీంతో అతడిని రూ.20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది గుజరాత్.
ఆడమ్ జంపా గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ముంబై స్పిన్నర్ తనుశ్ కోటియన్ ను తీసుకుంది. 25 ఏళ్ల తనుశ్ 26 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 19 లిస్ట్-ఏ మ్యాచులు, 23 టీ200లు ఆడాడు. అతడు 119 వికెట్లు, 1300లకు పైగా పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడిన జంపా ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో జీటీ తన తొలి మ్యాచును మార్చి 2న ముంబైతో, రాజస్థాన్ రాయల్స్ అదే రోజు లక్నో సూపర్ జెయింట్స్ తోనూ ఆడనుంది.
Also Read: CSK vs RCB IPL 2024 Live Updates: మరికాసేపట్లో క్రికెట్ పండగ ఆరంభం.. హోరెత్తనున్న స్టేడియాలు
Also Read: IPL History: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు బ్రేక్ అవ్వని రికార్డులు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook