ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఇటీవలే ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లండ్. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 విషయంలో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024 వెస్టిండీస్-అమెరికా సంయుక్త ఆధ్వర్యాన జరగనుంది. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2024 ఫార్మట్ ఎలా ఉంటుంది
వెస్టిండీస్-అమెరికా సంయుక్త ఆధ్వర్యాన జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో 5 గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 టీమ్స్ తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ విధంగా 8 జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ పోటీలుంటాయి. గెల్చిన జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఆ తరువాత ఫైనల్స్ ఉంటుంది.
సూపర్ 12 ఉండదిక
టీ20 ప్రపంచకప్ 2021, 2022లో క్వాలిఫయింగ్ దశలున్నాయి. కానీ టీ20 ప్రపంచకప్ 2024 లో మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్ ఉండదు. అదే సమయంలో సూపర్ 12 ఉండదు. ఇప్పుడు రెండేళ్ల తరువాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జరిగే మార్పులతో అభిమానులు ఉత్సాహం కనబరుస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనబోయే జట్లు
వెస్టిండీస్-అమెరికా ఆధ్వర్యాన జరిగే టీ20 ప్రపంచకప్ 2024 ఇప్పటికే క్వాలిఫయింగ్ పూర్తయింది. టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ 12లో 8 జట్లు నేరుగా ఎంట్రీ లభించింది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు స్థానముంది. మరో 8 జట్లు ఇంకా క్వాలిఫై కావల్సి ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook