World Cup 2023 NZ vs Pak: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లకు డూ ఆర్ డై లాంటి మ్యాచ్. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితి. ఓ విధంగా న్యూజిలాండ్ కంటే పాకిస్తాన్‌కే జీవన్మరణ సమస్య లాంటిది. అందుకే ఇవాళ జరగనున్న రెండు మ్యాచ్‌లలో ఇదే కీలకం కానుంది.
ప్రపంచకప్ 2023లో ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. రెండు జట్లు ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడాయి. న్యూజిలాండ్ 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్ 6 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. అందుకే సెమీస్ అవకాశాలు నిలుపుకోవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ విజయం తప్పనిసరి. ఓ విధంగా చెప్పాలంటే న్యూజిలాండ్ కంటే పాకిస్తాన్‌కే మరింత అవసరమని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆరు పాయింట్లే కలిగి ఉంది. ఈ రెండు జట్ల బలాబలాలు, గెలుపోటముల ట్రాక్ ఎలా ఉందో పరిశీలిద్దాం.
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకూ 115 వన్డేలు జరిగాయి. న్యూజిలాండ్ 51 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 60 మ్యాచ్‌లతో ఆధిక్యంలో ఉంది. ఇక రెండు దేశాల మధ్య ప్రపంచకప్ మ్యాచ్‌లు 5 జరిగితే పాకిస్తాన్ ఆధిక్యంలో ఉంది. బౌలింగ్, బ్యాటింగ్‌పరంగా రెండు జట్లూ సమ ఉజ్జీగా ఉన్నాయి. న్యూజిలాండ్ కంటే పాకిస్తాన్ జట్టు కాస్త పటిష్టంగా ఉన్నా..ఆ జట్టు ఆటగాళ్లు ఒత్తిడికి లోనై వికెట్లు పోగొటుకుంటున్నారు. గెలిచే మ్యాచ్‌లు కూడా ఓడిపోతుండటం ఇందుకు కారణం.
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్ లేదా కైల్ జామీసన్, టీమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
పాకిస్తాన్ ప్లేయింగ్ 11
బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మొహమ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
World Cup 2023 NZ vs Pak: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్‌లకు డూ ఆర్ డై మ్యాచ్, ఎవరిద