Rohit Sharma Becomes 2nd Indian To get this Record: ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభించిన అనంతరం 1000 పరుగులు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. మరో టీమిండియా(Team India) క్రికెటర్ అజింక్య రహానే ఇదివరకే 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ రోహిత్ శర్మ కేవలం 11వ మ్యచ్‌లో టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championships)లో ఈ మార్కు చేరుకోగా, రహానే 17వ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
Also Read: MS Dhoni: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టిన Virat Kohli, అడుగు దూరంలో
రోహిత్ శర్మ 11 మ్యాచ్‌లలో 67 సగటుతో 4 శతకాలు, రెండు అర్ధశతకాల సాయంతో వెయ్యి పరుగులు సాధించాడు. అజింక్య రహానే 17 మ్యాచ్‌లలో మూడు శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 44.58 సగటుతో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మార్కు చేరుకున్న టీమిండియా క్రికెటర్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) నిలిచాడు. అయితే ఈ ఘనత సాధించిన ఇద్దరూ ప్రస్తుత ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు.
Also Read: HBL PSL 6 postponed: కరోనా కారణంగా వాయిదా పడిన PSL 2021
కాగా, ఓవరాల్‌గా ఐసీసీ నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ నిలిచాడు. లబుషేన్ 13 మ్యాచ్‌లలో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీల సాయంతో 72.82 సగటుతో 1,675 పరుగులు సాధించాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 47.94 సగటుతో 3 శతకాలు, 8 అర్ధశతకాలతో 1,630 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 14 మ్యాచ్‌లలో 877 పరుగులతో ఉన్నాడు. వరుస డకౌట్లు కారణంగా వెయ్యి పరుగుల మార్క్ చేరుకోలేకపోయాడు కోహ్లీ.
Also Read: Kieron Pollard 6 Sixes Video: యువరాజ్ సింగ్ తరహాలో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన కీరన్ పోలార్డ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook