Yuzvendra Chahal attempts Allu Arjun's Pushpa dialogue: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా దేశ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలోని డైలాగ్‌లు, పాటలు చాలా పాపులర్ అయ్యాయి. సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీలు కూడా పుష్ప డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు క్రికెటర్లు అతీతులు కాదు. ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్స్ డైలాగ్స్, డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా చేరిపోయాడు.
టీమిండియా అల్లరి పిల్లడు యుజ్వేంద్ర చహల్.. 'పుష్ప' డైలాగ్ చెప్పాడు. 'తగ్గేదేలే' అంటూ ఇన్‌స్టా రీల్ చేశాడు. 'ఝుకేగా నహీ' అంటూ బేస్ వాయిస్‌లో డైలాగ్ చెప్పాడు. పుష్పలో అల్లు అర్జున్ ఏ విధంగా డైలాగ్ చెప్పాడో.. అచ్చు చహల్ కూడా అలానే చెప్పాడు. గదవ కింద నుంచి చేయి పైకి లేపుతూ ఝుకేగా నహీ (తగ్గేదేలే) అని అన్నాడు. దీనిపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సెటైర్ వేశాడు. చహల్‌ను 'కాపీ క్యాట్' అని పేర్కొన్నాడు.
క్రికెట్ ప్రపంచాన్ని 'పుష్ప' ఫీవర్ పట్టుకుంది. టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్‌తో పుష్పరాజ్‌ను అనుకరిస్తున్నారు. విదేశీ క్రికెటర్లు డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హాసన్ కూడా మైదానంలో డాన్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే రోజుకో 'పుష్ప' వీడియోను షేర్ చేస్తూ ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో యుజ్వేంద్ర చహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొదటి వన్డేలో మణికట్టు స్పిన్నర్ చహల్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. థన్ అద్భుత ప్రదర్శనకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా గెలుచుకున్నాడు. రెండో వన్డేలో తన కోటా 10 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కీలక సమయంలో వికెట్ పడగొట్టి మ్యాచును మలుపుతిప్పాడు. ఇక ఈరోజు మూడో వన్డే ఆడుతున్నాడు.
Also Read: Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్!!
Also Read: Drawing Eyes On Painting: బొమ్మకు కళ్లు గీసినందుకు.. మొదటి రోజే ఉద్యోగం పోయింది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook