గాయాలతో సీఎస్‌కే ఉక్కిరిబిక్కిరి: జట్టుకు రైనా దూరం..!

ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు వరుసదెబ్బలు తగులుతున్నాయి.

Last Updated : Apr 13, 2018, 08:59 AM IST
గాయాలతో సీఎస్‌కే ఉక్కిరిబిక్కిరి: జట్టుకు రైనా దూరం..!

ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు వరుసదెబ్బలు తగులుతున్నాయి. గాయంతో ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ఇప్పటికే దూరం కాగా మరో కీలక ఆటగాడు సురేష్  రైనా కూడా గాయాల బారినపడ్డాడు. మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో రైనా 10రోజులు టోర్నీకి దూరం కానున్నాడు. దీంతో ఆదివారం పంజాబ్‌‌తో మ్యాచ్‌కు... ఆ తరువాత రాజస్థాన్ మ్యాచ్‌తో రైనా ఆడే అవకాశాలు లేవని చెన్నై  సూపర్ కింగ్స్ వర్గాలు తెలిపాయి.

ఐపీఎల్‌కు చెన్నై దూరం..!

కావేరి జలవివాదం కారణంగా నిరసనలు తారాస్థాయికి చేరడంతో చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరపడం క్షేమం కాదని బీసీసీఐ భావిస్తోంది. తొలి మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట తమిళ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, స్టేడియంలోనూ నినాదాలు, క్రికెటర్లపై చెప్పులు విసరడం తెలిసిందే. ఈ తరుణంలోనే వేదిక మార్పుపై ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకోగా.. ప్రత్యామ్నాయ వేదిక ఏది అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే పూణే, వైజాగ్, త్రివేండ్రం, రాజ్‌కోట్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీల నుండి అందిన సమాచారం ప్రకారం, సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం పూణెవైపే మొగ్గు చూపినట్టు సమాచారం. దీంతో సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌కు ఇకపై పుణే హోం గ్రౌండ్‌ కానుంది. రెండేళ్లపాటు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఇప్పుడు అదే వేదికపై చెన్నైని నడిపించనున్నాడు. 

Trending News