/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అతి తక్కువ పరుగుల (87) రికార్డును రెండోసారి నమోదు చేసి.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడానికి జట్టు వైఫల్యమే కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. తమ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, బౌలర్లు రాణించినా తనతో పాటు ఇతర బ్యాట్స్‌మెన్లూ విఫలమయ్యారని చెప్పారు.

‘ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. ఇంత తక్కువ (118 పరుగుల) పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేయగల సత్తా జట్టుకు ఉన్నప్పటికీ ఆ తరహా పాత్ర పోషించలేకపోయాం. ఇలా ఎందుకు జరిగిందో చెప్పడానికి చాలా కారణాలను చెప్పగలను. కానీ, మా లోపాలను మేమే ఎత్తిచూపుకోవడం ఇష్టంలేదు. తప్పు మాదే. బౌలర్లు అద్భుతంగా రాణించినా, నాతో పాటు బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. తక్కువ స్కోరును డిఫెండ్‌ చేసుకోవడంలో సన్‌రైజర్స్‌ బాగా ఆడారు’’ అని  రోహిత్‌ చెప్పాడు.

ఇక  మంగళవారం నాటి మ్యాచ్‌తో ఐదు ఓటములను చవిచూసిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ముంబై తదుపరి మ్యాచ్‌ ఏప్రిల్‌ 28న చెన్నైతో ఆడనుంది. ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌.. పంజాబ్‌తో తలపడనుంది.

Section: 
English Title: 
IPL 2018: We only have ourselves to blame, says Rohit Sharma after humiliating loss vs SRH
News Source: 
Home Title: 

ప్ఛ్. మాదే తప్పు: రోహిత్ శర్మ

ప్ఛ్. మాదే తప్పు: రోహిత్ శర్మ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్ఛ్. మాదే తప్పు: రోహిత్ శర్మ