Dhoni Back To Back Sixes: లాస్ట్ ఓవర్లో ధోనీ బ్యాక్ టు బ్యాక్ సిక్సులు.. ఫ్యాన్స్ పూనకాలు

Dhoni Back To Back Sixes: ధోనీ సిక్సులు కొట్టిన తీరును స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే.. ధోనీని మళ్లీ పాత ఫామ్‌లో చూసినట్టు అనిపించింది. ధోనికి ఉన్న పాత ఇమేజ్‌ని మరోసారి గుర్తుకొచ్చేలా చేశాయి పంజాబ్ కింగ్స్‌పై అతడు కొట్టిన సిక్సర్ షాట్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 09:06 PM IST
Dhoni Back To Back Sixes: లాస్ట్ ఓవర్లో ధోనీ బ్యాక్ టు బ్యాక్ సిక్సులు.. ఫ్యాన్స్ పూనకాలు

Dhoni Back To Back Sixes: ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోనీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. లాస్ట్ ఓవర్లో రవింద్ర జడేజా డిస్మిస్ అయిన తరువాత స్ట్రైకింగ్‌కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు సిక్సులు కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 3 బంతుల్లో 13 పరుగులు రాబట్టి జట్టు స్కోర్ 200 మార్క్ చేరుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. నేడు కొట్టిన రెండు సిక్సులతో కలిపి ఇప్పటివరకు ఐపిఎల్ చరిత్రలో చివరి ఓవర్లో ధోనీ కొట్టిన సిక్సుల సంఖ్య 57 కి చేరింది. 

పంజాబ్ కింగ్స్ బౌలర్ శామ్ కుర్రాన్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోనీ రెచ్చిపోయి కొట్టిన సిక్సుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ సిక్సులు కొట్టిన తీరును స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే.. ధోనీని మళ్లీ పాత ఫామ్‌లో చూసినట్టు అనిపించింది. అన్నింటికిమించి ఇన్నింగ్స్ చివర్లో కీలకమైన పరుగులు రాబట్టేలా షాట్లు కొట్టే కూల్ కేప్టేన్ గా ధోనీకి పేరుంది. ధోనికి ఉన్న ఆ ఇమేజ్ ని మరోసారి గుర్తుకొచ్చేలా చేశాయి పంజాబ్ కింగ్స్ పై అతడు కొట్టిన సిక్సర్ షాట్స్.

ఇది కూడా చదవండి : Top 5 Batsmen in IPL 2023: ఐపిఎల్ 2023లో ఇరగదీస్తోన్న ఐదుగురు యువ ఆటగాళ్లు

పంజాబ్ కింగ్స్ బౌలర్లు మొదట్లో తేరుకోకపోయినప్పటికీ.. డెత్ ఓవర్లలో తమ అసలు రూపం చూపించడం మొదలుపెట్టారు. కగిసో రబడ, అర్షదీప్ సింగ్ బ్రిలియంట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనింగ్‌కి వచ్చిన కాన్వె రెచ్చిపోయి 52 బంతుల్లో రాబట్టిన 92 పరుగులు ( 16 ఫోర్లు, 1 సిక్స్ ) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కోర్ 200 మైలు రాయిని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన 37 పరుగులు కూడా ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌లో 86 పరుగులకు చేరేలా చేసింది.

ఇది కూడా చదవండి : Dhoni Almost Hits Deepak Chahar: చెన్నై బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టినంత పనిచేసిన ధోనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News