ఆకట్టుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని స్టైలిష్ ఫోటో

షిమ్లాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తోన్న ధోని

Last Updated : Aug 30, 2018, 09:50 AM IST
ఆకట్టుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని స్టైలిష్ ఫోటో

టెస్ట్ మ్యాచ్‌లకు గుడ్ బై చెప్పిన కారణంగా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఆ దేశం జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కి దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. సన్నిహిత మిత్రుల పెళ్లిళ్లు, పేరంటాలకు హాజరవడంతోపాటు భార్య సాక్షి, కూతురు జివాలకు తగినంత సమయం కేటాయిస్తూ వారితో సరదాగా గడిపేస్తున్నాడు. మధ్యమధ్యలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ షూటింగ్స్‌తో ఇదిగో ఇలా బిజీగా ఉంటున్నాడు. చల్లటి మంచు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో కుటుంబంతో టైమ్‌పాస్ చేస్తూ ఓ బ్రాండ్‌కు సంబంధించిన షూటింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌తో బిజీగా కనిపించాడు ధోని. 

ధోనికి ఎదురుగా ఉన్న వ్యక్తి ఇంకెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్. ప్రముఖ దర్శకుడు షూజిత్ సర్కార్ డైరెక్ట్ చేస్తున్న ఓ యాడ్ ఫిలింలో బాలీవుడ్ సీనియర్ నటుడు పంకజ్ కపూర్‌తో ధోని కలిసి నటిస్తున్నాడు. ధోని పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ సప్న భవానిని కూడా ఈ ఫోటోలో చూడవచ్చు. మహేంద్ర సింగ్ ధోని స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ధోని సైతం ఈ ఫోటోలో స్టైలిష్ యూత్ ఐకాన్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తున్నాడు.

Trending News