New Zealand Gets Semi Final Berth, T20 World Cup 2022 Group 1 Qualification Scenario: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. సెమీస్ రేస్ రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో.. కీలకమైన పోరులో ఐర్లాండ్‌పై 35 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 9 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్ బెర్తును ఖాయం చేసుకొన్న తొలి జట్టుగా కివీస్ నిలిచింది.
భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (37), ఆండ్రూ బాల్బిర్నీ (30) నిలకడగా ఆడారు. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 8 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 68 రన్స్ చేసి లక్ష్యం దిశగా సాగింది. అయితే కివీస్ స్పిన్నర్లు ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ వరుస ఓవర్లలో ఓపెనర్లతో పాటు హ్యారీ టెక్టర్ (2)ను పెవిలియన్ చేరారు. ఈ సమయంలో లొర్కాన్ టక్కర్ (13), గెరెత్ డెలానీ (10), జార్జ్ డాక్‌రెల్ (23) ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఐర్లాండ్ చివరికి 150/9 స్కోరుతో సరిపెట్టుకుంది. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్స్ తీశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (32), దేవాన్ కాన్వే (28) శుభారంభం ఇచ్చారు. కేన్ విలియమ్సన్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిచెల్ (31 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ తీశాడు. 19వ ఓవర్‌లో కేన్‌తో పాటు జేమ్స్ నీషమ్ (0), మిచెల్ సాంట్నర్ (0) వికెట్లను పడగొట్టాడు.
ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సూపర్ 12 దశలో గ్రూప్ 1లో కివీస్ ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో.. 7 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కివీస్ (+2.11) నెట్ రన్ రేట్ కూడా బాగుంది. అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించినా కివీస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్, ఇంగ్లండ్ తమ చివరి మ్యాచులో గెలిస్తే.. నెట్ రన్ రేట్ ఎక్కువ ఉన్న జట్టు సెమిస్ వెళుతుంది. ఆసీస్, ఇంగ్లండ్ తమ చివరి మ్యాచుల్లో ఓడితే శ్రీలంక సెమీస్ చేరుతుంది.
Also Read: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు
Also Read: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook