అరే అన్నా... అంటూ ధోనికి తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్

మహేంద్ర సింగ్ ధోనికి తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్ శర్మ

Last Updated : Jul 7, 2019, 08:18 PM IST
అరే అన్నా... అంటూ ధోనికి తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్

మహేంద్ర సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను అతడి కుటుంబమే కాకుండా తోటి ఆటగాళ్లు, సీనియర్ క్రికెటర్స్, అభిమానులు వేడుకగా జరుపుకుంటున్నారు. శనివారం రాత్రి శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో భార్య సాక్షి, గారాలపట్టి జీవా, తోటి ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి ధోని టీమిండియా విజయంతోపాటు తన పుట్టినరోజు వేడుకలనూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ధోని పుట్టిన రోజు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న మేటి క్రికెటర్స్ సైతం ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలావుంటే, మరోవైపు టీమిండియా ఆటగాళ్లు సైతం ధోని అభిమానుల తరహాలోనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై తమకు వున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ''అరే భాయ్ కేక్ కిదర్ హై'' అంటూ టీమిండియా 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ చేసిన ట్వీట్ నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ధోనికి రోహిత్ శర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను బయటపెట్టింది.

Trending News