అమీర్ షాహీ స్టేడియంలో విజయంతో ఐపీఎల్ 2020 లో ( IPL 2020 ) శుభారంభం చేసింది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. అయితే వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. దీంతో ధోనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్ 13వ సీజన్ లో తన సత్తా చాటలేకపోతున్నాడు.
ALSO READ| IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే
బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మిడిల్ ఆర్డర్ లో చివరిగా వస్తున్నాడు. దీంతో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలి ( Sourav Ganguly ) మాత్రం చెన్నై కెప్టెన్ కు సపోర్ట్ చేస్తున్నాడు.
బెస్ట్ ఫినిషర్, కానీ...
సుమారు 227 రోజుల తరువాత బ్యాటింగ్ కు దిగిన ధోనీ ( MS Dhoni ) .. రెండు బాల్స్ ఆడినా కానీ ఒక పరుగు చేయలేకపోయాడు. రెండో మ్యాచులో రాజస్థాన్ బౌలింగ్ లో ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. 18 బాల్స్ లో 29 పరుగులు చేసినా..ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీ మ్యాచును గెలిపించలేకపోయాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మూడో మ్యాచులో ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 15 బాల్స్ ఆడి కేవలం 12 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కానీ మ్యాచును మాత్రం గెలిపించలేకపోయాడు.
ALSO READ| Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్
ధోనికి దాదా టిప్స్
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై వస్తున్న విమర్శలకు సమాధానంతో పాటు ధోనికి చిట్కాలు చెప్పాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలి.
కెప్టెన్ గా ఉన్న సమయంలో ముందు నేను ధోనీనీ డ్రాప్ చేసినా.. తరువాత అతను 4వ స్థానంలో పక్కాగా సరిపోతాడు అని నిర్ణయించాను.. ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. అయితే చాలా కాలం తరువాత బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలా జరగడం సహజం.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR