Rohit Sharma: టీ20 ఫార్మాట్‌లో 'సెంచరీ' కొట్టిన హిట్‌మ్యాన్.. తొలి క్రికెట‌ర్‌గా ఘనత..

Rohit Sharma: మొహలీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా హిట్ మ్యాన్ సెంచరీ కొట్టాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 12:01 PM IST
Rohit Sharma: టీ20 ఫార్మాట్‌లో 'సెంచరీ' కొట్టిన హిట్‌మ్యాన్.. తొలి క్రికెట‌ర్‌గా ఘనత..

Rohit Sharma Creates history: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. జనవరి 11న స్వ‌దేశంలో అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan)తో జ‌రిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో పొట్టి ఫార్మాట్ లో 100 విజ‌యాల్లో భాగ‌మైన తొలి క్రికెటర్ గా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించాడు. పురుషుల క్రికెట్‌లో అత్య‌ధిక విజ‌యాల్లో(86) భాగ‌మైన క్రికెట‌ర్ల‌ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్(Shoaib Malik) రెండో స్థానంలోనూ, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 73 విజయాల్లోనూ, 70 విజయాలతో పాక్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్(Mohammad Hafeez), అప్గాన్ సీనియర్ ఆటగాడు నబీ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 

జూన్ లో పొట్టి ప్రపంచకప్ మెుదలుకానుంది. టీ20 వరల్డ్ కప్ స‌న్నాహ‌కాల్లో భాగంగా.. అప్గాన్ తో మూడు టీ20 మ్యాచ్ల్ సిరీస్ ను టీమిండియా ఆరంభించింది. మొహాలీ వేదికగా నిన్న జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో అప్గాన్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ ను తక్కువ స్కోరుకే కట్టడి ేచేసింది భారత్. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. నబీ 42 పరుగులతో రాణించాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత్  17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ ధూబే (60 నాటౌట్) అర్ధ సెంచరీతో మెరవగా.. జితేష్ శర్మ (31) రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

Also Read: Ind Vs Afg 1st T20 Full Highlights: మొహలీలో శివమెత్తిన శివమ్ ధూబే.. బెంబేలెత్తిన అఫ్గాన్‌ బౌలర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News